Mega Supplementary: మెగా సప్లిమెంటరీ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఇలా!
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. దరఖాస్తులకు జూన్ 14 వరకూ అవకాశం కల్పించారు. రూ.1,000 అపరాధ రుసుంతో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 3,000 అపరాధ రుసుముతో 28వ తేదీ వరకు, రూ.5,000 అపరాధ రుసుముతో జూలై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతపురం కేఎస్‌ఎన్ డిగ్రీ బాలికల కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు.
Posts at IIITDM: ట్రిపుల్ ఐటీడీఎంలో ఈ ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
● ఒక్కో సబ్జెక్టుకు రూ.1000, రెండు సబ్జెక్టులు రూ.3,000, మూడు సబ్జెక్టులు ఆపైన ఫెయిల్ అయి ఉంటే రూ.4,000 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
● డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం ఉత్తీర్ణులై, మూడో సంవత్సరంలో పరీక్షలు రాయకుండా ఉంటే రూ.3,000 అదనంగా అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
Agniveer Vayu Notification: అగ్నివీర్ వాయు నియామకాల నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు ఇలా..
● 1994–95 విద్యా సంవత్సరం నుంచి 2014–15 విద్యా సంవత్సరం వరకు చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
● 2008–09 విద్యా సంవత్సరం నుంచి రాయలసీమ వర్సిటీ ఏర్పాటైన నేపథ్యంలో.. అంతకుముందు ఎస్కేయూ పరిధిలో చదువుకున్న కర్నూలు జిల్లా విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
● అభ్యర్థులు గతంలో పరీక్ష రాసిన హాల్‌టికెట్ గానీ, మార్క్స్‌కార్డు గానీ దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది.
ఎంతోమందికి ఊరట..
గతంలో అనివార్య కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేని వారు, బ్యాక్‌లాగ్స్ (ఫెయిల్ అయినవారు) ఉన్నవారికి ఊరట కలిగించే ఈ నిర్ణయాన్ని ఇటీవలే ఎస్కేయూ ఉన్నతాధికారులు తీసుకున్నారు. డిగ్రీ ఫెయిల్ అయి పట్టా పొందలేని పరిస్థితుల్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యే సదవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా, వాటిన్నింటినీ రాయడానికి వీలు కల్పించారు.
Admissions: కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ప్రవేశాలకు ఇవి తప్పనిసరి