Skip to main content

Nine Days Holidays For Schools : ఈ స్కూల్స్‌కు వ‌రుస‌గా 9 రోజులు సెలవులు.. కానీ..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి ప‌బ్లిక్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హాల్‌టికెట్లను కూడా విడుదల చేసిన విద్యాశాఖ.
Education Department Announcement  Andhra Pradesh Education Department Update    Holiday Schedule for Exam Centers   Holidays For Schools News in AP Telugu    Andhra Pradesh Class 10 Public Examination Hall Tickets Released

మార్చి 18వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని డీఈఓ సుధాకర్‌రెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒంటిపూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలన్నారు. 

ఈ తేదీల్లో స్కూల్స్‌కి సెల‌వులు..
ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదోవ తరగతి పరీక్షలు జరగనున్నాయని.., ఈ పరీక్షలకు కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు పరీక్షలు జరిగే రోజుల్లో సెలవు ప్రకటించినట్లు తెలిపారు. మార్చి 18, 19, 20, 22, 23, 26, 27,28, 30 తేదీల్లో స్కూల్స్ సెల‌వులు ప్ర‌క‌టించారు విద్యాశాఖ అధికారాలు.

సెలవులు ప్రకటించిన స్కూళ్లు మ‌ర్చి 24, 31, ఏప్రిల్‌ 7, 13, 14, 21 తేదీలలో తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా స్థానిక గ్రామ పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల సహకారంతో ప్రతి పాఠశాలలో తాగునీటి వసతి ఏర్పాటు చేసుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పాఠశాలలో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. స్కూళ్లలో ఎవరైనా వాలంటరీ ఆర్గనైజేషన్‌ ద్వారా విద్యార్థులకు మజ్జిగ సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత జగనన్న గోరుముద్ద పథకాన్ని తప్పక అందించాలన్నారు.

AP SSC 10th Class 2024 Timetable ఇదే :
☛ మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
☛ మార్చి 19 న సెకండ్ లాంగ్వేజ్
☛ మార్చి 20 న ఇంగ్లిష్
☛ మార్చి 22 తేదీ మ్యాథ్స్‌
☛ మార్చి 23వ తేదీ ఫిజికల్ సైన్స్
☛ మార్చి 26వ తేదీ బయాలజీ
☛ మార్చి 27వ తేదీ సోషల్ స్టడీస్
☛ మార్చి 28వ తేదీ మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
☛ మార్చి 30వ తేదీ ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుంది.

ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ఉద‌యం 9 దాటితే  బ‌య‌టికి రావాలంటే.. భ‌య‌ప‌డుతున్నారు. ఏప్రిల్ నెల‌లో ఇంకా ఎండ‌లు ఎక్క‌వ ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పుతున్నారు. ఈ నేప‌థ్యంలో స్కూల్స్ విద్యార్థుల‌కు ముందుగానే వేస‌విసెల‌వులు ఇచ్చే అవ‌కాశం క‌న్పిస్తుంది. ప్ర‌స్తుతం ఒంటిపూట బడులు న‌డుస్తున్న విష‌యం తెల్సిందే. ఈ ఒంటిపూట బడులు ఏప్రిల్‌ 23వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ ఏడాది వేస‌వి సెల‌వులు ఇలా..
2024 ఏప్రిల్ 24వ తేదీ స్కూల్స్  వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వ‌రుకు ఈ వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అంటే దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. గ‌త ఏడాది కంటే.. ఈ ఏడాది వేస‌వి సెల‌వులు ఎక్క‌వగా ఇచ్చే అవ‌కాశం ఉంది. దాదాపు పైన ఇచ్చిన తేదీల్లోనే స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇంకా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు వేస‌వి సెల‌వులపై ఇంకా అధికారం ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. 

గ‌త ఏడాది సెల‌వులు ఇలా...
గ‌త ఏడాది తెలంగాణ‌ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వేసవి సెలవులను ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  గ‌త ఏడాది మే 1వ తేదీ నుంచి జూన్‌ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. గ‌త ఏడాది వేస‌వి సెల‌వులు త‌క్కువ‌గానే ఇచ్చారు.

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కూడా..
అయితే వీళ్ల‌కు కూడా ప‌రీక్ష‌లు పూరైన వెంట‌నే వేస‌వి సెల‌వులు రానున్నాయి. టెన్త్ విద్యార్థుల‌కు కూడా దాదాపు 50 నుంచి 60 రోజులు పాటు వేస‌వి సెల‌వులు రానున్నాయి.

Published date : 16 Mar 2024 10:24AM

Photo Stories