Amma Odi: పేదింటి విద్యార్థులకు అమ్మఒడి అండ..
కడప: పేదలంటే ప్రేమ, బడుగు లంటే అభిమానం, ప్రతి ఇంటా విద్యా కుసుమాలు వెల్లివిరియాలని వైఎస్సార్‌సీపీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. తల్లితండ్రులకు పిల్లల చదువు ఏమాత్రం బారం కాకూడదని సంకల్పించింది. ఇందుకోసం విద్యార్థులకు విద్యాకానుక పేరుతో అన్ని రకాల విద్యా సామాగ్రిని అందచేస్తుంది.
విద్యకు పేదరిక అడ్డురాకూడదనే సదుద్దేశ్యంలో వైస్.జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకానికి జీవం పోశాడు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తారతమ్యం లేకుండా పాఠశాలకు పంపే ప్రతి తల్లి ఖాతాకు నిధులను జమచేశాడు. 2019 ఎన్నికల ముందు చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పేదల కష్టాలను స్వయంగా చూశారు. తల్లితండ్రుల పేదరికం కారణంగా చిన్నారులను చదువుకు దూరం చేస్తున్నారని తెలుసుకున్నారు. అప్పుడే తన ఆలోచనల్లోంచి అమ్మఒడి పథకం రూపుదిద్దుకుంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఈ పథకం కింద బడికి పంపే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాకు రూ 15 వేల చొప్పున సాయం అందించాడు.
Engineering Seats: ఇంజనీరింగ్ సీట్లపై నిపుణుల అంచనా.. ఈసారి ఎక్కువ శాతం అర్హులయ్యే అవకాశం..!
గత నాలుగు విడతలుగా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ద్వారా వారి చదువులకు ఆర్థిక భరోసా కల్పించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో తమ పిల్లలను చదివించే తల్లుల ఖాతాలకు గత నాలుగు విడతలుగా ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. వారికి ఇచ్చే రూ.15 వేలలో రూ.2 వేలు పాఠశాలల మెయింటెనెన్స్‌కు వెచ్చిస్తుండగా, మిగిలిన రూ. 13 వేలు నేరుగా తల్లుల ఖాతాలకు జమ చేశారు. గత నాలుగు విడతల్లో సరాసరిన జిల్లాలో 1.80లక్షల మంది తల్లుల ఖాతాలకు రూ.1337.40 కోట్ల వరకు జమ చేశారు. ప్రైవేటు పాఠశాలల పిల్లల తల్లితండ్రులకు ఫీజుల అవసరాల కోసం వీటిని వినియోగించుకున్నారు.
ఆలోచించి.. సాయం పెంచి..
అమ్మ ఒడి కింద ఇచ్చే డబ్బులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సాయాన్ని రూ.17 వేలకు పెంచనున్నట్లు సీఎం జగన్ ఎన్నికల మేనిఫేస్టోలో పొందుపరిచారు. గడిచిన విద్యా సంవత్సరంలో 1,80,203 మంది లబ్థిదారులు ఉండగా తాజా పెంపుదల మేరకు ఈ ఏడాది 306.34 కోట్లు వరకు ప్రభుత్వ సాయం అందచేయనుంది.
Inter Results: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన స్టార్ హీరో ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
గడిచిన ఐదేళ్లలో ఇచ్చిన జగనన్న అమ్మ ఒడి వివరాలు
సంవత్సరం లబ్థిపొందిన డబ్బులు తల్లులు
20219–20 2,55,587 రూ.383.38 కోట్లు
2020–21 2,68,076 రూ.402.11 కోట్లు
2021–22 1,87,742 రూ.281.61 కోట్లు
(36 మండలాలు)
2022–23 1,80,203 రూ. 270.30
మొత్తం 8,91,608 రూ. 1337.4 కోట్లు
అమ్మఒడితో ఆనందాల సవ్వడి
రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపును మేనిఫెస్టోలో పొందుపరిచిన సీఎం జగన్.
జిల్లాలో లక్షా 80 వేల మంది విద్యార్థులకు లబ్థి
విద్యార్థుల బంగారు భవిషత్తుకు..
విద్యార్థుల బంగారు భవిషత్తుకు అమ్మ ఒడి పథకం అండగా నిలుస్తోంది. పేద పిల్లల చదువులంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎంతో ఇష్టం. అందు కోసమే అమ్మ ఒడి పథకం అమలు చేసి పేదవారికి అండగా నిలుస్తున్నారు. అమ్మ ఒడి మాకు ఒక గొప్ప వరంగా మారింది. జగన్ అమ్మ ఒడి పెంపుతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలనే కోరిక బలపడింది.
– ఎన్. వెంకటేశ్వరమ్మ, ఎర్రగుంట్ల
మాటకు కట్టుబడి...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖచ్చితంగా ఇచ్చిన హామీని అమలు చేస్తారు. ఆచరణ సాధ్యమైన హామీనే ఇయన ఇస్తారు.. ఈ విషయం గడిచిన ఐదేళ్లలో నిరూపనైయింది. అమ్మ ఒడి సాయం పెంపు పేదల విద్యకు మరింత భరోసా ఇచ్చినట్లువుతుంది. వచ్చే ఐదేళ్లలో తప్పకుండా హామీని అమలు చేస్తారన్మ నమ్మకం కలిగింది
– తప్పెట మరియమ్మ, గాదెగూడూరు, రాజపాలెం మండలం
Admissions for Ph.D: ఎన్‌ఐఈపీఏలో పీహెచ్‌డీ ప్రవేశానికి దరఖాస్తులు..