AIAPGET 2024 Notification: ఆయూష్ కళాశాలలో ప్రవేశానికి ఏఐఏపీజీఈటీ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల..
సాక్షి ఎడ్యుకేషన్: ఆల్ ఇండియా ఆయుష్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐఏపీజీఈటీ)! ఈ ఎంట్రన్స్‌లో స్కోర్ ఆధారంగా.. దేశ వ్యాప్తంగా ఉన్న ఆయుష్ కళాశాలల్లో ప్రవేశం పొందొచ్చు!! తాజాగా.. 2024కు సంబంధించి ఏఐఏపీజీఈటీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఏఐఏపీజీఈటీ పరీక్ష విధానం, ఆయుష్ కోర్సులతో కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరాలంటే.. నీట్–పీజీలో ర్యాంకు సాధించాలి. ఇదే మాదిరిగా బ్యాచిలర్ స్థాయి ఆయుష్ కోర్సుల ఉత్తీర్ణులకు పీజీలో ప్రవేశం కల్పించేందుకు నిర్వహించే పరీక్ష.. ఆల్ ఇండియా ఆయుష్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఆయుష్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్‌సీఐఎస్‌ఎం), నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి (ఎన్‌సీహెచ్) నిర్ణయించాయి. దీంతో ఎన్‌సీఐఎస్‌ఎం పరిధిలోని ఆయుర్వేద, సిద్ధ, యునానీ.. అదే విధంగా ఎన్‌సీహెచ్ పరిధిలోని హోమియోపతి పీజీ, ఎండీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు.
CUET UG 2024 Admit Card Released: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు(సీయూఈటీ)అడ్మిట్ కార్డులు విడుదల
ఏఐఏపీజీఈటీ స్కోర్‌తోనే ప్రవేశాలు
ఎన్‌సీఐఎస్‌ఎం, ఎన్‌సీహెచ్‌ల మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం–2019లో తొలిసారిగా ఏఐఏపీజీఈటీని నిర్వహించారు. అప్పటి నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతోంది. దేశంలో ఆయుష్ కోర్సులను అందిస్తున్న అన్ని యూనివర్సిటీలు, కళాశాలలు ఈ పరీక్ష స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. దీంతో ఆయుష్ విభాగంలో పీజీ/ఎండీ కోర్సులు చదవాలనుకునే వారికి ఏఐఏపీజీఈటీలో ఉత్తీర్ణత తప్పనిసరిగా మారింది.
ఆల్ ఇండియా కోటా
వైద్య విద్యకు సంబంధించి యూజీ, పీజీ ప్రవేశాల్లో ఆల్ ఇండియా కోటా విధానం అమలవుతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆయుష్ విభాగంలో.. ఆల్ ఇండియా కోటాలో అందుబాటులో ఉండే ఇతర రాష్ట్రాల్లోని 15 శాతం సీట్లను ఏఐఏపీజీఈటీ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రాల స్థాయిలో.. వైద్య విశ్వ విద్యాలయాలు ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి ఏఐఏపీజీఈటీ స్కోర్ ఆధారంగా స్థానిక సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది.
Admissions for Ph.D: ఎన్‌ఐఈపీఏలో పీహెచ్‌డీ ప్రవేశానికి దరఖాస్తులు..
అర్హతలు
ఏఐఏపీజీఈటీకి దరఖాస్తు చేసుకునేందుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ. నుంచి బీఏఎంఎస్/బీయూఎంఎస్/ బీఎస్‌ఎంఎస్/బీహెచ్‌ఎంఎస్ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు ఏడాది ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసుకోవాలి. 2024, జూలై 31లోపు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకోనున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా సీసీఐఎం/సీసీహెచ్/ఎన్‌సీఎస్‌ఐఎం/ఎన్‌సీహెచ్/రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని బోర్డ్‌ల నుంచి ప్రొవిజనల్ లేదా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగుండాలి.
480 మార్కులకు పరీక్ష
ఏఐఏపీజీఈటీ పరీక్ష మొత్తం 120 ప్రశ్నలు–480 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ బ్యాచిలర్ డిగ్రీకి సరితూగే సబ్జెక్ట్‌లను దరఖాస్తు సమయంలోనే(ఆయుర్వేద/హోమియోపతి/సిద్ధ/యునానీ) ఎంచుకోవాల్సి ఉంటుంది.
Chess Grandmaster: 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించి.. గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన చెస్ ప్లేయర్ ఇతనే..!
బ్యాచిలర్ డిగ్రీ స్థాయి అంశాలు
ఏఐఏపీజీఈటీలో.. ఆయా విభాగాల్లో అడిగే ప్రశ్నలు సంబంధిత సబ్జెక్ట్‌లో అభ్యర్థులకున్న అవగాహనను పరిశీలించేలా ఉంటాయి. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌లు /కోర్సులకు సంబంధించి బేసిక్ ప్రిన్సిపుల్స్, అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయలాజీ, మెడిసినల్ బోటనీ, ఫార్మకోగ్నసీ, మోడ్రన్ పాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఆబ్‌స్ట్రెట్రిక్స్ అండ్ గైనకాలజీ, పిడియాట్రిక్స్, మెడికల్ స్టాటిస్టిక్స్, ప్రివెంటివ్ మెడిసిన్‌లలోని అంశాలపై పట్టు సాధించాలి.
పలు స్పెషలైజేషన్లు
ఆయుష్ పీజీ కోర్సుల్లో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేదలో.. జనరల్ మెడిసిన్‌కు సరితూగే విధంగా ఉండే కాయ చికిత్స, జనరల్ సర్జరీకి సరితూగే శల్యతంత్ర, ఆయుర్వేద వాచస్పతి, ఆయుర్వేద ధన్వంతరి, పంచకర్మ వంటి స్పెషలైజేషన్లు ప్రవేశం పొందొచ్చు.
- హోమియోపతిలో మెటీరియా మెడికా, హోమియోపతిక్ ఫిలాసఫీ, హోమియోపతిక్ ఫార్మసీ, ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్, పిడియాట్రిక్స్, సైకియాట్రీ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి.
- సిద్ధ వైద్యంలో ఎండీ సిద్ధ వైద్య, టాక్సికాలజీకి సరితూగే నంజు మారుతువమ్, గుణపాదం, కుఝాంజదాయ్ మారుతువమ్, నోయి నాడల్, పుర మారుతువమ్, వర్మ మరుతువమ్, సిద్ధార్ యోగ మారుతువమ్ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
- యునానీకి సంబంధించి యునానీ మెడిసిన్స్, యునానీ ఫార్మసీ, యునానీ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ సోషల్ మెడిసిన్, యునానీ పిడియాట్రిక్స్, యునానీ పాథాలజీ, యునానీ రెజిమెంటల్ థెరపీ, యునానీ ఫిజియాలజీ, యునానీ డెర్మటాలజీ వంటి స్పెషలైజేషన్లల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
భవిష్యత్తు అవకాశాలు
ఆయుష్ కోర్సుల్లో ఎండీ/ఎంఎస్ పూర్తి చేసుకున్న వారికి విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆయుష్ విభాగాల పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడికల్ ఆఫీసర్స్‌గా కొలువులు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా.. టీచింగ్ హాస్పిటల్స్‌లో అధ్యాపక వృత్తిలోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆయుర్వేద, హోమియో కోర్సుల ఉత్తీర్ణులకు సంబంధిత ఫార్మాస్యూటికల్ విభాగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
స్వీయ ప్రాక్టీస్
ప్రజలు సహజ సిద్ధ వైద్య రీతుల వైపు దృష్టిపెడుతున్నారు. దీంతో ఆయుష్ స్పెషలిస్ట్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఆయుష్ పీజీ చేసిన వారు సొంత హాస్పిటల్స్ నెలకొల్పి స్వయం ఉపాధి పొందొచ్చు. ఆయుష్ విభాగాల్లోనూ కార్పొరేట్ తరహా ఆస్పత్రులు ఏర్పాటవుతుండడం కూడా భవిష్యత్తు అవకాశాలు విస్తృతం చేసేందుకు దోహదం చేస్తోంది. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.
TS CET 2024 Notification: టీఎస్‌సెట్ నోటిఫికేషన్ విడుదల.. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..!
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, మే 15
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: 2024, మే 17 – మే 19
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: 2024, జూలై 2 నుంచి
- ఏఐఏపీజీఈటీ తేదీ: 2024, జూలై 6
- వెబ్‌సైట్: www.nta.ac.in/, https://exams.nta.ac.in/AIAPGET
Tags
- AIAPGET
- Post Graduation
- admissions
- Entrance Exam
- notifications
- All India Ayush PG Entrance Test
- National Commission for Homeopathy
- National Testing Agency
- medical education
- entrance exam format for AIAPGET
- Medical students
- specializations
- ayurvedic specilaizations
- online applications
- Date of AIAPGET exam
- deadline for registrations
- medicine education
- Education News
- Career Opportunities
- Alternative Medicine
- exam procedure
- notifications
- sakshieducationlatest admissions