Skip to main content

FDDI Admissions: ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా!

ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ) దేశవ్యాప్తంగా 12 క్యాంపస్‌లలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆలిండియా సెలక్షన్‌ టెస్ట్‌–2025 (ఏఐఎస్‌టీ–2025)లో సాధించిన స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
Admissions in UG and PG courses in FDDI   FDDI Admissions 2025-26 Notification  Footwear Design and Development Institute Admission Open 2025  Apply for FDDI Bachelor's and Master's Degree Courses 2025

ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లు: నోయిడా, కోల్‌కతా, రోహ్‌తక్, ఫుర్సత్‌గంజ్, జోద్‌పూర్, చెన్నై, ఛింద్వారా, చండీగఢ్, గుణ, అంక్లేశ్వర్, హైదరాబాద్, పాట్నా.
మొత్తం సీట్ల సంఖ్య: 2,390.
కోర్సుల వివరాలు: 
బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడీఎస్‌): బీడీఈఎస్‌(ఫుట్‌వేర్‌ డిజైన్‌ –ప్రొడక్షన్‌), బీడీఈఎస్‌(ఫ్యాషన్‌ డిజైన్‌), బీడీఈఎస్‌(లెదర్, లైఫ్‌ స్టైల్‌ అండ్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌). 
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు(8 సెమిస్టర్లు).
బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ): బీబీఏ(రిటైల్‌–ఫ్యాషన్‌ మర్చండైజ్‌)
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు(8 సెమిస్టర్లు).
మాస్టర్‌ డిగ్రీ కోర్సులు:

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎండీఎస్‌): ఎం.డిఈఎస్‌(ఫుట్‌వేర్‌ డిజైన్‌– ప్రొడక్షన్‌), ఎం.డిఈఎస్‌(ఫ్యాషన్‌ డిజైన్‌);

కోర్సు వ్యవధి: రెండేళ్లు(నాలుగు సెమిస్టర్లు).
మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ): ఎంబీఏ(రిటైల్‌–ఫ్యాషన్‌ మర్చండైజ్‌)
కోర్సు వ్యవధి: రెండేళ్లు(నాలుగు సెమిస్టర్లు).
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 10+2, మాస్టర్‌ డిగ్రీ కోర్సులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు 25 ఏళ్లు మించకూడదు. పీజీ కోర్సులకు వయసు లేదు.    
ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా సెలక్షన్‌ టెస్ట్‌ (ఏఐఎస్‌టీ–2025) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.04.2025
ఏఐఎస్‌టీ ప్రవేశ పరీక్ష తేది: 11.05.2025.
వెబ్‌సైట్‌: https://www.fddiindia.com

>> ANGRAU Jobs: అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!

Published date : 13 Feb 2025 02:22PM

Photo Stories