Skip to main content

IIIT Admissions: ట్రిపుల్ ఐటీల్లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తుల విధానం ఇలా..!

2024–25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 6న నోటిఫికేషన్‌ వెలువరించింది. ద‌ర‌ఖాస్తుల చివ‌రి తేది, విధానం, అర్హులు వంటి వివ‌రాల‌ను ప‌రిశీలించండి..
Release of notification for admission in Triple IT and its process

నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల బీటెక్‌ సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకుగాను వర్సిటీ ఈ నెల 6న నోటిఫికేషన్‌ వెలువరించింది. ఒక్కో సెంటర్‌లో 1,000 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో మరో 100 సీట్లు ఉన్నాయి. 

ఈ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఈ నెల 8 నుంచి జూన్‌ 25 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. ప్రవేశాల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీ–ఏకు 7 %, బీసీ–బీకి 10 %, బీసీ–సీకి 1%, బీసీ–డీకి 7%, బీసీ–ఈకి 4% చొప్పున రిజర్వేషన్‌ అమలు చేస్తారు. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 5%, సైనికోద్యోగుల పిల్లలకు 2%, ఎన్‌సీసీ విద్యార్థులకు 1%, స్పోర్ట్స్‌ కోటా కింద 0.5%, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటా కింద 0.5% సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి కేటగిరీలోనూ 33.33% సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.

Free Admissions: కార్పొరేట్‌ కళాశాలల్లో ఉచిత ప్రవేశాలు

ప్రవేశార్హతలు 
అభ్యర్థులు ప్రథమ ప్రయత్నంలోనే 2024లో ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షలో రెగ్యులర్‌ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు 31–12–2024 నాటికి 18 ఏళ్లు నిండకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే 21 ఏళ్లు నిండకుండా ఉండాలి. 

Gurukul Admission Test Results: విడుద‌లైన గురుకుల ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాలు.. రాష్ట్ర‌స్థాయిలో మెరిసిన విద్యార్థులు వీరే!

మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్లు ఇలా.. 
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్‌ రెసిడెన్షియల్‌ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్‌ హైస్కూళ్లు, మున్సిపల్‌ హైస్కూళ్లలో చదివిన విద్యార్థులకు వారి మార్కులకు 4% డిప్రెవేషన్‌ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. దీనిని సాంఘికంగా, ఆర్థికంగా వెను­కబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వెయిటే­జీగా పేర్కొన్నారు. 85% సీట్లను స్థానికం గాను, మిగిలిన 15% సీట్లను మెరిట్‌ కోటాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. 

CWUR Rankings: సీడబ్ల్యూయూఆర్‌ ర్యాంకింగ్‌లో భారత్‌కు చెందిన 65 విద్యా సంస్థలకు చోటు

Published date : 15 May 2024 04:14PM

Photo Stories