Skip to main content

DIKSHA Course: ఉపాధ్యాయులకు దీక్షా కోర్సులు..!

ఉపాధ్యాయులకు వృత్తిపరమైన మెళకువలను నేర్పేందుకు డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఫర్‌ నాలెడ్జ్‌ షేరింగ్‌ (దీక్ష)ను ఎన్‌సీఈఆర్‌టీ అందుబాటులోకి తెచ్చింది.
DIKSHA online course for teachers with certificates

రాయవరం: ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులను మెరుగుపర్చుకుంటూ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన మెళకువలను నేర్పేందుకు డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఫర్‌ నాలెడ్జ్‌ షేరింగ్‌ (దీక్ష)ను ఎన్‌సీఈఆర్‌టీ అందుబాటులోకి తెచ్చింది. దీక్ష అనేది పాఠశాల విద్యలో జాతీయ వేదికగా చెప్పవచ్చు. జాతీయ విద్యా విధానంలో భాగంగా ఉపాధ్యాయులకు టీచింగ్‌–లెర్నింగ్‌ ఈ–కంటెంట్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది. అభివృద్ధి చేసిన ఈ–కంటెంట్‌ను దీక్ష ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్‌ చేసి, ఉపాధ్యాయులకు వృత్తిపరమైన నైపుణ్యాలు అందించడానికి కృషి చేస్తున్నారు.

Education Awards: ముఖ్యమంత్రి విద్యాపురస్కారాలు..

దీక్ష ప్లాట్‌ఫామ్‌లో విద్యార్థుల స్థాయికి తగ్గట్టుగా, పాఠ్య పుస్తకాల రూపకల్పన, వీడియోలు, మూల్యాంకనం, ఆడియోలు తదితర కంటెంట్‌తో పాటుగా, డిజిటల్‌ పాఠ్య పుస్తకాలు పొందుపర్చారు. మన రాష్ట్రానికి సంబంధించిన కంటెంట్‌తో పాటు, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యాపరమైన కంటెంట్‌ను కూడా దీక్ష ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఉచితంగా పొందే అవకాశముంది. ఉపాధ్యాయులు వారి బోధన పద్ధతులను మెరుగుపర్చుకునేందుకు, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు అనేక కోర్సులు, నవీన బోధనా పద్ధతులను అందుబాటులో ఉంచారు. నేర్చుకున్న ఈ–కంటెంట్‌ను ఉపాధ్యాయులు బోధన–అభ్యసన పద్ధతుల్లో సముచితంగా అనుసంధానించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

25% Seats For Students In Private Schools: ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పేద పిల్లలకు 25శాతం సీట్లు, ఇలా దరఖాస్తు చేసుకోండి

రెండు రకాల కోర్సులు

దీక్షలో రెండు రకాల కోర్సులను ప్రవేశ పెట్టారు. నిష్ట 3.0లో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, 1–5 తరగతులు బోధన చేసే ఏ క్యాడర్‌కు చెందిన ఉపాధ్యాయుడైనా ఈ కోర్సును చేయాల్సి ఉంది. ఈ కోర్సులో 12 రకాల మాడ్యూల్స్‌ ఉంటాయి. ఈ 12 మాడ్యూల్స్‌ను సంబంధిత అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంది. నిష్ట 4.0లో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్‌ రీసోర్స్‌ మొబైల్‌ టీచర్లు(సీఆర్‌ఎంటీ) కోర్సులు పూర్తి చేయాలి. ఇందులో ఆరు రకాల మాడ్యూల్స్‌ ఉంటాయి.

How to Overcome Exam Stress: త్వరలోనే టెన్త్‌&ఇంటర్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌.. ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఈ ఆరు మాడ్యూల్స్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ప్రతీ కోర్సు పూర్తి చేయగానే ఆ కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. ఇప్పటికే మూడు సార్లు నిష్ట కోర్సులను ఆన్‌లైన్‌లో రన్‌ చేశారు. ఇప్పుడు చివరి అవకాశంగా నాల్గవసారి ఈ కోర్సులను రీరన్‌ చేస్తున్నారు. గతంలోనే ఈ కోర్సులు చేసి సర్టిఫికేట్లు పొందిన వారు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. నిష్ట 3.0, 4.0కు సంబంధించి సందేహాల నివృత్తికి జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్లను కూడా నియమించారు.

మార్చి1 లోగా ప్రవేశం పొందాలి

బోధన, అభ్యసనం, మూల్యాంకనంలో దీక్ష వినియోగంపై ‘దీక్ష’ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆన్‌లైన్‌ శిక్షణను ఉపాధ్యాయులకు ఇస్తున్నారు. మార్చి 1వ తేదీలోగా నిష్ట 3.0, నిష్ట 4.0 కోర్సులకు సంబంధించి ప్రవేశం పొంది, కోర్సులు పూర్తి చేయాలి. దీక్ష ప్లాట్‌ఫామ్‌లో లాగినై ఆన్‌లైన్‌లో కోర్సులు పూర్తి చేయాలి. మార్చి 20వ తేదీలోగా ప్రతి ఒక్కరూ వారికి సంబంధించిన మాడ్యూల్స్‌ పూర్తి చేసి, సర్టిఫికెట్లు పొందాలి.

Shiksha Award Ceremony: జిల్లా స్థాయి ముఖ్యమంత్రి శిక్షా పురస్కార ప్రదానోత్సవం

వృత్తి నైపుణ్యం పెరుగుతుంది

DIKSHA

ప్రతి ఉపాధ్యాయుడు దీక్ష ఆన్‌లైన్‌ శిక్షణ పొందాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ పొందడం ద్వారా బోధనాభ్యసన పద్ధతులను మెరుగు పర్చుకునే వీలుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు దోహదం చేస్తోంది. ఉమ్మడి జిల్లాల పరిధిలో నిర్దేశించిన ఎంఈవోలు, సీఆర్‌ఎంటీలు, ఉపాధ్యాయులు, ఐసీడీఎస్‌ పీవోలు, సూపర్‌వైజర్లు, కార్యకర్తలు తప్పనిసరిగా కోర్సులు పూర్తి చేయాలి.

– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ

Students Health Checkup: గురుకుల విద్యార్థుల ఆరోగ్య పరీక్ష..

ఆన్‌లైన్‌ సర్టిఫికెట్స్‌ జారీ

నిష్ట 3.0, 4.0 కోర్సులకు సంబంధించిన వారికి లింక్‌ను ఇప్పటికే సంబంధిత అధికారుల ద్వారా పంపించారు. ఆ లింక్‌ ద్వారా మాడ్యూల్స్‌ను ఆన్‌లైన్‌లో చదివి, నేర్చుకున్న అంశానికి సంబంధించి పరీక్షను రాయాల్సి ఉంది. మూడు ప్రయత్నాల లోపల ఈ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంబంధిత పరీక్షలో 70శాతం స్కోర్‌ సాధించిన వారు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ను యాప్‌ ద్వారా పొందుతారు. ఈ కోర్సులు మార్చి 20 వరకు అందుబాటులో ఉంటాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న మండల విద్యాశాఖాధికారులు, ఐసీడీఎస్‌ పీవోలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఆర్‌ఎంటీలు ఆన్‌లైన్‌ శిక్షణ తీసుకోవాల్సి ఉంది.

TET Exam Arrangements: నాలుగు కేంద్రాల్లో టెట్‌ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం..

Published date : 26 Feb 2024 04:42PM

Photo Stories