Skip to main content

Half day Schools 2024: స్కూల్‌ పిల్ల‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : రోజు రోజుకు ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రత్తలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. తీవ్రమైన ఎండలకు తోడు ఉక్కపోత వేధిస్తోంది.
Half days Schools 2024    Announcement of temporary one-day schools to combat heatwave effects

ఎండలకు తాళలేక విద్యార్థులు ఇబ్బందులు పడతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. అత్యధిక ఉష్ణోగ్రత్తలు నమోదవుతుండడంతో విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కీలకమైన బోర్డు పరీక్షలు జరుగుతుండడంతో పాటు ఎండల ప్రభావంతో ఒంటి పూట బడులు కొనసాగించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

☛☛ Schools and Colleges Holidays List in March 2024 : మార్చిలో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

మార్చి 15వ తేదీ నుంచి..
మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించ‌నున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ స్కూళ్లు ఏప్రిల్‌ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. 

ఈ రోజుల్లో ఉద‌యం 8 గంటల నుంచి..
ఈ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. అయితే 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు. వీరికి తొలుత మధ్యాహ్నం భోజనం అందజేసి ఆ తర్వాత తరగతులు కొనసాగిస్తారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి.

అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూళ్లకు ఒంటి పూట బడుల తేదీల‌పై త్వ‌ర‌లోనే ఏపీ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకోనుంది.

టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 07 Mar 2024 02:07PM

Photo Stories