Skip to main content

Schools and Colleges Holidays List in March 2024 : మార్చిలో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలుగు రాష్ట్రాల్లో ఈ సారి మార్చి నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఎక్కువ‌గానే రానున్నాయి. గ‌త నెల ఫిబ్ర‌వ‌రి నెల కంటే.. ఈ నెల‌(మార్చి)లోనే ఎక్కువ‌గానే ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌ ప్రకారం.. మార్చి నెలలో సాధారణంగా వచ్చే 5 ఆదివారాలు కాకుండా మొత్తం 3 రోజులు సెలవులు రానున్నాయి.
Schools & College Holidays List in March 2024   March calendar showing holidays in Telugu states

మార్చి 8వ తేదీన మహాశివరాత్రి, 25వ తేదీన హోలీ, మార్చి 29వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు ప్రకటించారు.

వరుసగా మూడు రోజులు సెలవులు..

Holidays News March 2024 Telugu

అయితే.. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానునున్నాయి. మహాశివరాత్రి ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన వ‌స్తుంది. అయితే.. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు మొదటి రోజు మాత్రమే శివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటిస్తాయి. ఈ సారి కూడా మార్చి 8వ తేదీ ఒక్కరోజు సెలవు ప్రకటించినా.. ఆ రోజు శుక్రవారం కావడం తర్వాతి రోజు రెండో శనివారం, మరుసటి రోజు ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలువులు వచ్చాయి.

ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్ 

ఇదే నెల‌లో వ‌రుస‌గా మ‌రో సారి రెండు రోజులు పాటు సెల‌వులు..
మార్చి 25వ తేదీన (సోమ‌వారం) హోలీ పండ‌గ ఉంది. ఈ పండ‌గ‌కు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఇవ్వ‌నున్నారు. అలాగే మార్చి 24వ తేదీన ఆదివారం. ఈ రోజుల సాధార‌ణ సెల‌వు ఉన్న విష‌యం తెల్సిందే. దీంతో వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు రానున్నాయి. 
మార్చి 29న గుడ్ ఫ్రైడే ఉన్నాయి. విద్యార్థులు ఈ సెలవులను సద్వినియోగం చేసుకోవచ్చు. దాదాపు మార్చి నెల‌లో 8 నుంచి 10 రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.

టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ఏప్రిల్ నెలలో కూడా..

summer holidays news telugu 2024

ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5న, ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న, ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) సందర్భంగా ఏప్రిల్ 11న, శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17వ తేదీన సెలవులు రానున్నాయి. అలాగే ఏప్రిల్ నెల చివ‌రిల్లో దాదాపు రెండు నెల‌ల పాటు వేస‌విసెల‌వులు ఇవ్వ‌నున్నారు.

దాదాపు 14 రోజుల పాటు బ్యాంక్ సెలవులు ఇలా.. 
2024 మార్చి​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని ఆర్​బీఐ విడుదల చేసింది. మార్చి నెల‌లో బ్యాంక్​లు 14 రోజుల పాటు మూతపడి ఉంటాయి. ఫిబ్రవరిలో బ్యాంక్​లకు 11 రోజుల పాటు సెలవులు వ‌చ్చాయి. వీటిల్లో పబ్లిక్​ హాలీడేలు, పండుగలు, వీకెండ్స్​ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. మార్చి నెల‌కు సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ కింది విధంగా ఉంది

☛ మార్చి 1 : చప్​చర్​ కౌత్​, మిజోరంలోని బ్యాంక్​లకు సెలవు.
☛ మార్చి ​3 : ఆదివారం.
☛ మార్చి​ 8 : మహా శివరాత్రి. దిల్లీ, బిహార్​, రాజస్థాన్​, తమిళనాడు, త్రిపుర, బెంగాల్​, మిజోరం, అసోం, సిక్కిం, మణిపూర్​, మేఘాలయ, నాగాలాండ్​, ఇటానగర్​, గోవా మినహా ఇతర ప్రాంతాల్లోని బ్యాంక్​లకు సెలవు.
☛ మార్చి​ 9 : రెండో శనివారం. అన్ని బ్యాంక్​లకు సెలవు.
☛ మార్చి​ 10 : ఆదివారం. అన్ని బ్యాంక్​లకు సెలవు.
☛ మార్చి​ 17 : ఆదివారం. అన్ని బ్యాంక్​లకు సెలవు.
☛ మార్చి​ 22 : బిహార్​ దివాస్​. బిహార్​లోని బ్యాంక్​లకు సెలవు.
☛ మార్చి​ 23 : నాలుగో శనివారం. అన్ని బ్యాంక్​లకు సెలవు.
☛ మార్చి​ 24 : ఆదివారం. అన్ని బ్యాంక్​లకు సెలవు.
☛ మార్చి​ 25 : హోలీ. కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్​, కేరళ, నాగాలాండ్​, బిహార్​, శ్రీనగర్​లోని బ్యాంక్​లు మినహా, ఇతర ప్రాంతాల్లోని బ్యాంక్​లకు సెలవు.
☛ మార్చి​ 26 : యోసాంగ్​ సెకెండ్​ డే. ఒడిశా, మణిపూర్​, బిహార్​లోని బ్యాంక్​లకు సెలవు.
☛ మార్చి​ 27 : హోలీ. బిహార్​లోని బ్యాంక్​లకు సెలవు.
☛ మార్చి​ 29 : గుడ్​ ఫ్రైడే. త్రిపుర, అసోం, రాజస్థాన్​, జమ్ముకశ్మీర్, హిమాచల్​ ప్రదేశ్​ మినహా ఇతర బ్యాంక్​లకు సెలవు.
☛ మార్చి​ 31 : ఆదివారం. అన్ని బ్యాంక్​లకు సెలవు.

పై విధంగా 2024 మార్చి నెలలో బ్యాంక్​లకు 14 రోజుల పాటు సెలవులు రానున్నాయి. బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలను అందరు వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. మనీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ కూడా చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. కొన్ని సేవలకు మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది.

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే..

☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

Published date : 02 Mar 2024 04:48PM

Photo Stories