NIOS Open School Exam Halltickets Released: 10, 12వ తరగతి పరీక్షల హాల్‌టికెట్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) సెకండరీ(10వ తరగతి), సీనియర్‌ సెకండరీ(12వ తరగతి) పరీక్షల హాల్‌టికెట్స్‌ను విడుదల చేసింది. పరీక్ష రాయనున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.nios.ac.in,https://sdmis.nios.ac.inలో హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
NIOS Open School Exam Halltickets Released

కాగా ఈనెల 22 నుంచి నవంబర్‌ 29 వరకు సెకండరీ, సీనియర్‌ సెకండరీ థియరీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. NIOS అధికారిక పోర్టల్‌లో హాల్‌టికెట్స్‌ అందుబాటులో ఉన్నాయి. సమాచారం కోసం ఫోన్‌ నెంబర్లు 040-24750712, 040-24752859లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు. 

Wipro Recruitment 2024: విప్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. జీతం రూ.6లక్షలకు పైనే..

హాల్ టిక్కెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

  • ముందుగా NIOS అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి.
  • హోంపేజీలో కనిపిస్తున్న https://sdmis.nios.ac.in/search/hall-ticket లనే లింక్‌ను క్లిక్‌చేయండి. 
  • మీ ఎన్‌రోల్‌మెంట్‌ నెంబర్‌ను నమోదు చేయండి.
  • తర్వాతి స్క్రీన్‌లో మీకు హాల్‌టికెట్‌ డిస్‌ప్లే అవుతుంది.
  • భవిష్యత్‌ అవసరాల కోసం హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

#Tags