Skip to main content

Merit Test for Students : విద్యార్తుల‌కు ఎడ్యుకేషనల్‌ ఎపిఫనీ సంస్థ‌ మెరిట్ టెస్ట్.. రెండు ద‌శ‌ల్లో!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎడ్యుకేషనల్‌ ఎపిఫనీ అనే సంస్థ మెరిట్‌ టెస్ట్‌ (ఈఈఎంటీ)ను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరానికి నిర్వహించనుంది.
Merit test for government school students by educational epiphany  School Education Director Vijayaramaraju announcing the Merit Test schedule

రాయవరం: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వంతో పాటు, పలు ఎన్‌జీవో ఆర్గనైజేషన్లు ఏటా వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎడ్యుకేషనల్‌ ఎపిఫనీ అనే సంస్థ మెరిట్‌ టెస్ట్‌ (ఈఈఎంటీ)ను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరానికి నిర్వహించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష జరుగుతుంది. ఎటువంటి రుసుము తీసుకోకుండా గత 12 ఏళ్లుగా ఈ పరీక్ష నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించే ఈ పరీక్షకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు విజయరామరాజు ఈ నెల 15న షెడ్యూల్‌ విడుదల చేశారు.

రెండు దశల్లో..

ఈఈఎంటీ పరీక్షను ప్రిలిమ్స్‌, మెయిన్‌ అనే రెండు దశల్లో నిర్వహిస్తారు. విద్యార్థులు తమ ఇష్టం ప్రకారం ఇంటి నుంచే లేదా పాఠశాల నుంచి హాజరయ్యే అవకాశం కల్పించారు. కోడ్‌ తంత్ర అనే సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరీక్ష జరుగుతుంది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 29వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. దానిలో 40 శాతం పైబడి మార్కులు పొందడంతో పాటు, ఆన్‌లైన్‌ పరీక్ష నియమ నిబంధనలు సక్రమంగా పాటించిన వారు మెయిన్‌ పరీక్షకు అర్హత పొందుతారు. ఆ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 19న జరుగుతుంది. దానిలో 50 శాతం మార్కులు పొంది, ఆన్‌లైన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించిన వారికి బహుమతులు అందజేస్తారు.

MBBS 2024 Seats: కొత్త మెడికల్‌ కాలేజీ ..... 150 ఎంబీబీఎస్‌ సీట్లు

సిలబస్‌

7, 10 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర అకడమిక్‌ క్యాలెండరు 2024–25 సిలబస్‌ను అనుసరించి, డిసెంబరు నాటికి పూర్తయిన సిలబస్‌పై 80 శాతం, జనరల్‌ నాలెడ్జ్‌పై 20 శాతం ప్రశ్నలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియాలలో రాసుకోవచ్చు. గణితం, సైన్స్‌, సోషల్‌, జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, మేధా సంబంధిత ప్రశ్నలు ఇస్తారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో విద్యార్థి పేరు, పరీక్ష రాయదలచిన మొబైల్‌ నంబరు, విద్యార్థి/తల్లిదండ్రుల ఇమెయిల్‌, విద్యార్థి పుట్టిన తేదీ, ఫొటోలు, తరగతి, చిరునామా తదితర వివరాలు నమోదు చేసుకోవాలి.

Follow our YouTube Channel (Click Here)

పరీక్ష నిర్వహణ

గణితం, సైన్స్‌ (జీవ, భౌతిక, రసాయన శాస్త్రాలు), సోషల్‌ సబ్జెక్టులపై పరీక్ష ఉంటుంది. విద్యార్థుల తరగతి స్థాయి ఆధారంగా జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌పై ప్రశ్నలు ఇస్తారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో 60 ప్రశ్నలు (100 మార్కులు), మెయిన్స్‌ పరీక్షలో 60 ప్రశ్నలు (100 మార్కులు) ఇస్తారు. తేలికపాటి వాటికి ఒక మార్కు, మధ్య రకం ప్రశ్నలకు రెండు మార్కులు, కఠిన మైన వాటికి మూడు మార్కులు కేటాయిస్తారు.

Join our Telegram Channel (Click Here)

బహుమతులు

పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 162 మందిని ఎంపిక చేసిన దాదాపు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతిగా రూ.20 వేలు అందిస్తారు. రాష్ట్రస్థాయిలో 7వ తరగతిలో రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు చొప్పున అందజేస్తారు. జిల్లా స్థాయిలో 10వ తరగతిలో రూ.8 వేలు, రూ.6 వేలు, రూ.4 వేలు, 7వ తరగతి విద్యార్థులకు రూ.5 వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు పంపిణీ చేస్తారు. ఇక మండల స్థాయిలో 10, 7 తరగతుల్లో ప్రథమ స్థానం పొందిన వారికి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసాపత్రాన్ని అందిస్తారు. పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 95731 39996, 96667 47996, 63032 93502 నంబర్లను సంప్రదించవచ్చు.

Follow our Instagram Page (Click Here)

ఆన్‌లైన్‌లో పరీక్షలు

ఈఈఎంటీ పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను విద్యాపరంగా ప్రోత్సహించేందుకు డాక్టర్‌ తవనం వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న సంస్థ ద్వారా ఉచితంగా పోటీలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్ష రాసేలా ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు ప్రోత్సహించాలి.

– దూదేకుల నబీ, రాష్ట్ర సమన్వయ కర్త, ఈఈఎంటీ 2025

పోటీ పరీక్షలు, స్కాలర్‌షిప్‌ టెస్టులతో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే అవకాశం కలుగుతుంది. వారిలో పోటీతత్వం పెరిగి మరింత బాగా చదువుకునేందుకు దోహదపడుతుంది. ఇదే ఉద్దేశంతో ఎడ్యుకేషన్‌ ఎపిఫనీ అనే సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లో 7, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి పరీక్షల షెడ్యూల్‌ ను విడుదల చేసింది. ఒక్క రూపాయి ఫీజు కట్టనవసరం లేకుండా, నచ్చిన చోటు నుంచే, ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష రాసుకునే అవకాశం ఉంది.

Artemis III Mission: అర్టిమిస్-3 మిషన్‌తో చంద్రుడి ఉపరితలంపైకి వ్యోమగాములు..!

పరీక్ష రుసుము లేదు

పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎటువంటి రుసుం లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అలాగే పరీక్ష కోసం దూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా ఇంటి వద్దనే ఉండి లేదా పాఠశాలలో గానీ రాసుకునే వెసులుబాటు ఉంది. మొబైల్‌ ఫోన్‌/ల్యాప్‌టాప్‌/ట్యాబ్‌/ కంప్యూటర్‌ తదితర వాటిలో ఒక దాన్ని ఎంచుకుని, ఆన్‌లైన్‌ పరీక్ష నిబంధనలకు లోబడి పరీక్ష రాయాలి. ప్రిలిమ్స్‌ రాసే వారికి డిసెంబరు 22న, మెయిన్స్‌ పరీక్ష రాసే వారికి వచ్చే ఏడాది జనవరి 10న మాక్‌ టెస్టులు రాసే అవకాశం కల్పిస్తారు. httpr://educationaepiphany.orfeemt2024/refirtration.php లింక్‌ ద్వారా ఆసక్తి ఉన్న విద్యార్థులు నవంబరు 14 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Join our WhatsApp Channel (Click Here)

Published date : 17 Oct 2024 01:33PM

Photo Stories