Skip to main content

Artemis III Mission: అర్టిమిస్-3 మిషన్‌తో చంద్రుడి ఉపరితలంపైకి వ్యోమగాములు..!

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, చంద్రుడిపై మానవులను మళ్లీ పంపాలనే తమ లక్ష్యాన్ని సాకరించే దిశగా అడుగులు వేస్తోంది.
NASA Artemis III mission to moon unveils new spacesuit designed by Prada

అర్టిమిస్-3 మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలంపైకి వ్యోమగాములను పంపించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ప్రాడా కంపెనీ తన వంతు సాయం అందిస్తోంది. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాముల కోసం అత్యాధునిక స్పేస్‌ సూట్‌ను (అక్సియోమ్‌ ఎక్‌స్ట్రా వెహిక్యులర్‌ మొబిలిటీ యూనిట్‌–ఎక్స్‌ఈఎంయూ) అభివృద్ధి చేసింది.

ఇందుకోసం ఏరోసిస్‌ అండ్‌ ఫ్యాషన్, అక్సియోమ్‌ స్పేస్‌ సంస్థల సహకారం తీసుకుంది. ఇటలీలోని మిలన్‌ నగరంలో ఇంటర్నేషనల్‌ అస్ట్రోనాటికల్‌ కాంగ్రెస్‌లో ఈ స్పేస్‌ సూట్‌ను ప్రదర్శించింది. మిగిలి ఉన్న కొన్ని పరీక్షల్లో సైతం ఈ స్పేస్‌సూట్‌ నెగ్గితే చంద్రుడిపైకి వెళ్లే నాసా వ్యోమగాములు ఇదే ధరించబోతున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్నవాటితో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ప్రాడా కంపెనీ చెబుతోంది.

SpaceX Launch: స్టార్‌షిప్‌ ఐదో బూస్టర్‌ ప్రయోగ పరీక్ష సక్సెస్.. లాంచ్‌ప్యాడ్‌పై తొలిసారి..

చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకొని, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా ఈ స్పేస్‌సూట్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రాడా కంపెనీ చీఫ్‌ మార్కెటింగ్‌ అధికారి లోరెంజో బెర్టిలీ చెప్పారు. దృఢత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో దీనికి తిరుగులేదని అన్నారు. ఇప్పటిదాకా జరిగిన పరీక్షల్లో ప్రాడా స్పేస్‌సూట్‌ నెగ్గింది. 2025లో తుది పరీక్షలు జరుగబోతున్నాయి. వివిధ రకాల వ్రస్తాల ఉత్పత్తిలో ప్రాడాకు మంచి పేరుంది.

Published date : 17 Oct 2024 01:21PM

Photo Stories