Skip to main content

August 9th Holiday 2024 : ఆగ‌స్టు 9వ తేదీన సెలవు.. సీఎంకి వినతి.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆగస్టు 9వ తేదీన సెల‌వు ప్ర‌క‌టించాల‌ని మంత్రి సీతక్క సహా ఆదివాసీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
Telangana cm revanth reddy  Minister Sitakka requesting a holiday declaration  Adivasi leaders advocating for International Adivasi Day holiday  Discussion on International Adivasi Day holiday in Telangana  International Adivasi Day holiday request in Telangana

ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ రోజున‌ సెలవు ప్రకటించాల‌న్నారు. ప్రపంచ దేశాలు, కొన్ని ఆదివాసీ రాష్ట్రాలు ఇప్ప‌టికే ఆగస్టు 9వ తేదీన‌ సెలవు ప్రకటించాయి. ఆ రోజున ఆదివాసీలకు సంబంధించిన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు చర్చించుకోవడానికి వారు అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణలోనూ సెలవు ఇవ్వండి అని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

☛ Three Days Schools and Colleges Holidays 2024 : జూలై 27,28,29 తేదీల్లో వ‌రుస‌గా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. కార‌ణం ఇదే..!

ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన‌..
ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం 1994 నుంచి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1994 డిసెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తన తీర్మానం 49/214లో ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ ప్రజల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించిన విష‌యం తెల్సిందే.

ప్రపంచంలోని మూలవాసుల హక్కులను ప్రోత్సహించడానికి.., రక్షించడానికి ఐక్యరాజ్యసమితి ఈ రోజును నిర్వహిస్తుంది. ఆదివాసీ ప్రజలు సమాజానికి చేసిన విజయాలు మరియు సహకారాన్ని జరుపుకునే రోజు కూడా. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో 476 మిలియన్లకు పైగా ఆదివాసీ ప్రజలు నివసిస్తున్నారు. వారు ప్రపంచ జనాభాలో 5% ఉన్నారు.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

Published date : 29 Jul 2024 08:45AM

Photo Stories