Skip to main content

PM Shri Competitions for Students : పీఎంశ్రీ జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థుల‌కు రాష్ట్ర స్థాయి పోటీలు..

విద్యా వైభవ్‌ క్విజ్‌ పోటీల్లో పి.గన్నవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు..
School students talent in pm shri district and state level competitions  ZP Girls High School in Amalapuram hosting the district level Vidya Vaibhav Olympiad

అమలాపురం టౌన్‌: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి, వారిలో పోటీతత్వాన్ని పెంచాలని డీఈఓ ఎం.కమలకుమారి సూచించారు. ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ)కు జిల్లాలో ఎంపికైన పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి విద్యా వైభవ్‌ ఒలింపియాడ్‌ పోటీలు స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. జిల్లాలో పీఎంశ్రీకు ఎంపికైన 26 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా వైభవ్‌ ఒలింపియాడ్‌, మంథన్‌ మండల్‌, డిజిటల్‌ క్విస్ట్‌, డిస్కవరీ లెర్నింగ్‌ అండ్‌ లోకల్‌ సైట్స్‌ అంశాల్లో పోటీలు జరిగాయి.

Contract Faculty : ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రారంభించాలి

విద్యా వైభవ్‌ క్విజ్‌ పోటీల్లో పి.గన్నవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు బి.సింధు, ఎల్‌.అజేయుడు (ప్రథమ), మండపేట శ్రీగౌతమి మున్సిపల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్‌.దీక్షిత, ఎస్‌.గీతాశ్రీ (ద్వితీయ), హసన్‌బాడ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీహెచ్‌ఎన్వీ మహేశ్వరి, సీహెచ్‌ తనూశ్రీ (తృతీయ) విజేతలుగా నిలిచారు. మంథన్‌ మండల్‌ డిబేట్‌ పోటీల్లో కె.గంగవరం మండలం దంగేరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి డీఎంఎల్‌ఎస్‌ఎస్‌ విద్య, అయినవిల్లి మండలం సిరిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.సాయి అశ్రిత, రామచంద్రపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.హర్షిణి దుర్గ, డిస్కవరీ అండ్‌ లోకల్‌ సైట్స్‌ ఫొటో ఎగ్జిబిషన్‌లో రాజోలు మండలం కడలి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని వి.లక్ష్మీజ్యోతి, అమలాపురం మహాత్మాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం.దత్త గోవింద్‌, మలికిపురం మండలం బట్టేలంక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సీహెచ్‌ వైష్ణవి, డిజిటల్‌ క్వెస్ట్‌ పోటీల్లో ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి జి.శేషపద్మ వైష్ణవి, ఐ.పోలవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్‌కేఎస్‌ఎస్‌ మీనన్‌, మండపేట ఎన్‌జీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని వై.ప్రణీతలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను గెలుచుకున్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

జిల్లా విజేతలను త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని డీఈఓ తెలిపారు. పోటీలకు అమలాపురం మహాత్మ గాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బి.కామేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. పాఠశాల హెచ్‌ఎం వి.విజయకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు కో ఆర్డినేటర్‌ ఎ.మధుసూదనరావు, సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, ప్రోగ్రామ్‌ నోడల్‌ అధికారి పి.రాంబాబు, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మకాయల గణేశ్వరరావు, విత్తనాల శ్రీనివాస్‌ తదితరులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Published date : 18 Oct 2024 12:57PM

Photo Stories