Contract Faculty : ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రారంభించాలి
కంబాల చెరువు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని జిల్లా కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు యు.లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ సమస్యల్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లేందుకు పలు రకాల ప్రదర్శనలు చేపట్టామన్నారు.
24 ఏళ్లుగా పనిచేస్తున్న తమ సర్వీసులను రెగ్యులర్ చేసేందుకు ఉద్దేశించిన యాక్టు–30, జీవో నెంబర్ 114లను తక్షణమే అమలు చేయాలని పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ దాదాపు పూర్తవుతుండగా ఎన్నికల కోడ్ వల్ల ఆగిన ఫైల్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)