Skip to main content

AP Schools : అస్తవ్యస్తంగా మారిన విద్యావ్యవస్థ.. ఉపాధ్యాయుల స‌ర్దుబాటు పేరుతో..!

గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి. ఇప్పుడు అభివృద్ధి కనిపించడం లేదు.
AP Education system is now disorganized by government   Government schools development over the last five years  Decrease in number of students attending government schools in 2024

విద్య సామాజిక బాధ్యత అని భారత రాజ్యాంగం చెబుతోంది. అందుకే 14 ఏళ్లలోపు పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య అందించాలని పేర్కొంది. కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేసిన అనేక పథకాలను నిలిపేసింది. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసింది. పలుచోట్ల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం మానేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2023–24 విద్యాసంవత్సరంలో 1,54,191 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తుండగా 2024–25కు ఆ సంఖ్య 1,44,500కు తగ్గింది. 9,691 మంది పిల్లలు బడి మానేశారు.

Forest Department Jobs: అటవీ శాఖలో పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు...జీతం 31వేలు

అలసత్వం పనికిరాదు

గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి. ఇప్పుడు అభివృద్ధి కనిపించడం లేదు. తమ ప్రభుత్వం వచ్చాక చదువుకునే ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికీ పథకం అమలు కాలేదు. అసలు ఇస్తారో లేదో కూడా తెలియదు. గత ప్రభుత్వంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో పిల్లలు చదువుతున్నా ‘అమ్మ ఒడి’ పథకం వర్తింపజేశారు. ప్రభుత్వ స్కూళ్లపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది.

– షణ్ముగం, విద్యార్థి తండ్రి, పూతలపట్టు

Follow our YouTube Channel (Click Here)

సర్కారు బడులను అభివృద్ధి చేయాలి

సర్కారు బడుల పట్ల చిన్నచూపు కరెక్టు కాదు. వాటి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి కోట్లు ఖర్చు చేసింది. కార్పొరేట్‌ పాఠశాలలకంటే అందంగా తీర్చిదిద్దారు. అందువల్లే తల్లిదండ్రులకు బడులపై నమ్మకం కుదిరింది. కూటమి ప్రభుత్వం వచ్చాక బడులకు గడ్డు రోజులు దాపురించాయి. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేయడంతోపాటు సర్కారు బడులను అభివృద్ధి చేయాలి.
– కేశవన్‌, విద్యార్థి తండ్రి, సీఎంకండ్రిగ, పాలసముద్రం మండలం

JEE Main 2025: జేఈఈ మెయిన్‌లో ఛాయిస్‌ ఎత్తివేత

చిత్తూరు కలెక్టరేట్‌ : పేద విద్యార్థులు చదివే బడులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి స్కూళ్లను అందంగా తీర్చిదిద్దింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని కూడా అటకెక్కించింది. దీంతో పనులు ఆగి బడులు కళావిహీనంగా తయారయ్యాయి. అపరిశుభ్రత తాండవిస్తోంది. ఈ క్రమంలో పిల్లలను ఆకర్షించడంలో ప్రభుత్వ స్కూళ్లు వెనుకబడిపోయాయి. దీనికితోడు విద్యార్థుల చేరికలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది.

Follow our Instagram Page (Click Here)

Join our Telegram Channel (Click Here)

ఇష్టారాజ్యంగా సర్దుబాటు

స్కూళ్లలో సర్దుబాటు పేరుతో ఇష్టారాజ్యంగా జరిగిన నియామకాలు విద్యార్థుల అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం చూపినట్టు ఉపాధ్యాయులే చెబుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్టు ఉపాధ్యాయులు లేరు. ముఖ్యంగా గణితం, సైన్స్‌, ఇంగ్లీషు సబ్జెక్టులు బోధించే టీచర్ల కొరత ఉంది. కొన్ని పాఠశాలల్లో ఇతర సబ్జెక్టు టీచర్‌తో బోధన చేయిస్తున్నారు. ‘టీచర్లు ఉంటే విద్యార్థులు ఉండరు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నచోట టీచర్లు ఉండరు’ అన్నట్లుగా జిల్లాలో పరిస్థితి తయారైంది. జిల్లాలో చాలా చోట్ల ఇదే దుస్థితి. రాజకీయ జోక్యంతో ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయుల సర్దుబాటు జరగడంతో ఇలాంటి పరిస్థితి దాపురించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Inter Examination Fee Schedule: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించడానికి షెడ్యూల్‌ విడుదల.. ఇదే చివరి అవకాశం

గత ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల మధ్య తేడా

సంవత్సరం ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్‌ బడుల్లోని విద్యార్థులు

2019–20 3,43,734 2,35,506

2020–21 3,74,138 2,10,719

2021–22 3,82,951 1,94,263

2022–23 1,70,982 73,765

2023–24 1,54,191 79,734

Join our WhatsApp Channel (Click Here)

పనులు ఆపేసిన కూటమి

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు గత ఐదు సంవత్సరాల్లో నాడు–నేడు పథకం కింద ఎంతో అభివృద్ధి చెందాయి. జిల్లాలో మొదటి దశ నాడు– నేడు కింద 743 పాఠశాలల్లో సుమారు రూ.182.48 కోట్లతో పనులు చేపట్టారు. రెండవ దశలో 1,209 పాఠశాలల్లో రూ.448.06 కోట్లతో పలు పనులు చేశారు. మొదటి దశలో ప్రారంభించిన పనులు 100 శాతం పూర్తి చేశారు. రెండవ దశలో చేపట్టిన పనులను కూటమి ప్రభుత్వం ఆపివేయడంతో సర్కారు బడుల్లో పురోగతి ఆగిపోయింది.

Inter Exams 2025: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్‌ విడుదల

Published date : 18 Oct 2024 12:45PM

Photo Stories