Skip to main content

Forest Department Jobs: అటవీ శాఖలో పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు...జీతం 31వేలు

Forest Department Jobs  Wildlife Institute merit-based job selection notification  Central Government job selection by merit marks at Wildlife Institute  Notification for job issuance at Wildlife Institute based on merit  Wildlife Institute job selection affiliated with Forest Department
Forest Department Jobs

కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు సంబందించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ నుండి పరీక్ష లేకుండా అప్లికేషన్ చేసుకున్నవారిలో మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఐసీయూదు విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు.

10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీ క్లర్క్‌ ఉద్యోగాలు.. జీతం 32వేలు: Click Here

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి, ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు ఉన్నవారికి అవకాశం కల్పిస్తూ ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాల ప్రకటన లోని పూర్తి సమాచారం చుసి వెంటనే ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.


అప్లికేషన్ చేసుకునే ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ లోని వివరాల ఆధారంగా 22nd అక్టోబర్ తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. పోస్ట్ ద్వారా నోడల్ఆఫీసర్, ది రీసెర్చ్ రిక్రూట్మెంట్ & ప్లేసెమెంట్ సెల్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్ అడ్రస్ కు దరఖాస్తులు పంపించాలి.

ఉద్యోగాల వివరాలు, అర్హతలు:
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి 49 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీ లేదా PG లో అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

వయో పరిమితి వివరాలు:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. Sc, st, obc, pwd అభ్యర్థులకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 05 సంవత్సరాలు, 03 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులలో అర్హతలు ఉన్న అభ్యర్థుల నుండి డిగ్రీ, Pg లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా సెలక్షన్ ఉంటుంది.

శాలరీ ఎంత ఉంటుంది:
సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹31,000/- జీతంతో పాటు HRA కూడా చెల్లిస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర ఎటువంటి అలవెన్స్ లు ఉండవు.

అప్లికేషన్ ఫీజు:
అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, OBC, EWS, PHC అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. శాలరీ ఎంత ఉంటుంది:

అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్:
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్ ఉండాలి.

పైన తెలిపిన డాక్యుమెంట్స్ తో పాటు అప్లికేషన్ ఫారం పూర్తి చేసి గడువులోగా దరఖాస్తులు పంపించాలి.

ఎలా అప్లికేషన్ చేసుకోవాలి: అటవీ శాఖ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలోనే అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి.
 

Published date : 18 Oct 2024 03:40PM

Photo Stories