Skip to main content

Open Tenth and Inter: పకడ్బందీగా ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వాహణ.. తేదీ..?

విద్యార్థులకు ఓపెన్‌ టెన్త్‌ ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ మెరకు అధికారులతో నిర్వహించిన కలెక్టర్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏర్పాట్ల ఆదేశాలను జారీ చేశారు..
Open tenth and intermediate examinations instructions by Collector Venkatesh Dotre

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో ఈ నెల 25 నుంచి మే 2 వరకు ఓపెన్‌ పది, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

UPSC Civil Services Results: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు విడుదల..ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచడంతోపాటు తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్‌, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

School Education Department: విద్యార్థులను చేర్చుకోవడంలో అలసత్వం వద్దు

Published date : 16 Apr 2024 02:54PM

Photo Stories