Courses and Jobs: ఖర్చు లేకుండా శిక్ష‌ణ‌తో ఉద్యోగం

ప్ర‌భుత్వ ఐటీఐ కళాశాల‌లో ఉచితంగా శిక్ష‌ణ‌ను అందించి, ప్ర‌భుత్వం ఖ‌ర్చుతో ఉద్యోగం క‌ల్పిస్తాం అని జిల్లా అధికారి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఆ విద్య ఎక్క‌డ, ఎటువంటి ఉద్యోగాలు ల‌భిస్తాయి అని వివ‌ర‌ణ‌ను ఇచ్చారు.
free courses available for jobs offers by government

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్‌ఎస్‌డీసీ), షిరిడీ సాయి డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో ఎల్డర్లీ కేర్‌ టేకర్స్‌ (వృద్ధులను చూసుకోవడం) కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎల్‌.ఆనంద్‌ రాజ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 18–35 మధ్య వయసున్న యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 30 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. సర్టిఫికెట్‌ ఇచ్చి, ప్రభుత్వ ఖర్చుతో కువైట్‌, దుబాయ్‌, ఖతార్‌ లాంటి దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 9963897702 కు కాల్‌చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Job Offers: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌

తపాలా ఉద్యోగాలకు

40 మంది ఎంపిక

అనంతపురం సిటీ: తపాలా శాఖ బ్రాంచ్‌ పోస్టాఫీసుల్లో ఖాళీ ఉన్న పోస్టులకు 40 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం జాబితా విడుదలైంది. బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ (బీపీఎం) పోస్టులకు 21 మంది, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ (ఏబీపీఎం) పోస్టులకు 18 మందిని ఎంపిక చేశారు. డాక్‌ సేవక్‌గా మరొకరు ఎంపికయ్యారు. ఈ నెల 16 లోగా అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు వెరిఫికేషన్‌ చేయించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు తీసుకురావాలన్నారు.

Highest Salary For Degree Student : చదివింది డిగ్రీ.. రూ.50 లక్షల‌ జీతం.. ఎలా అంటే..?


కరోనా బ్యాచ్‌ వారికే మళ్లీ చాన్స్‌!

ఉద్యోగాల భర్తీలో కరోనా బ్యాచ్‌కే మళ్లీ అవకాశాలు దక్కాయి. కోవిడ్‌ ఉధృతి కారణంగా గతంలో దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. చేసేది లేక అప్పట్లో పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులను మొదటి శ్రేణిలో పాస్‌ చేసేశారు. ఈ క్రమంలో తపాలా శాఖలో భర్తీ చేసే పోస్టులన్నీ కరోనా బ్యాచ్‌ వారికే సరిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు.
 

#Tags