Skip to main content

Job Offers: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌

యువ‌త‌ల‌కు నిర్వ‌హిస్తున్న జాబ్‌మేళాలో అర్హులున్న‌వారందరూ హాజ‌రు కావాల‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉద్యోగానికి కావాల్సిన అర్హ‌త‌లు ఉంటే అభ్య‌ర్ధులు జాబ్‌మేళాలో పాల్గొన‌వ‌చ్చ‌ని తెలిపారు.
job mela opened for the needed and qualified
job mela opened for the needed and qualified

సాక్షి ఎడ్యుకేష‌న్: స్థానిక బీసీ కాలనీలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఈ నెల 8న నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధి అధికారి డి.అరుణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని ఎస్‌బీఐ కార్డ్స్‌, యూనియన్‌ బ్యాంక్‌ కార్డ్స్‌ సంస్థలు వివిధ కేడర్‌లలో 100 పోస్టులకు ఇంటర్‌/డిగ్రీ విద్యార్హతగల పురుష, మహిళా అఽభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

National Best Teacher Awards: ముగ్గురు ఉపాధ్యాయులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం.. ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..

డెక్కన్‌ కెమికల్‌ సంస్థలో 150 ఉద్యోగాలకు బీఎస్సీ (కెమిస్ట్రీ) విద్యార్హతగల పురుష అభ్యర్థులు, అరబిందో ఫార్మా యూనిట్‌లో 20 ప్రొడక్షన్‌ హెల్పర్‌ పోస్టులకు పదోతరగతి పాస్‌/ఫెయిల్‌ అయిన పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ‘ఎన్‌సీఎస్‌.జీఓవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకొని బయోడేటా, రెండు పాస్‌ఫొటోలతో ప్రభుత్వ ఐటీఐకు హాజరుకావాలని సూచించారు.
 

Published date : 06 Sep 2023 05:54PM

Photo Stories