Job Mela Results: జాబ్ మేళాల ద్వారా ఉపాధి పొందిన నిరుద్యోగులు..

త‌రుచూ జ‌రిపిన జాబ్ మేళాల ద్వారా ఉపాధి పొందిన వారిలో ఈ ముగ్గురు యువ‌కులు కూడా ఉన్నారు. ప్ర‌భుత్వం నిర్వ‌హించిన మేళాల‌ను సంద‌ర్శించి, ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొని వారి అర్హ‌త‌ల‌కు త‌గిన ఉద్యోగాన్ని వీరు సంపాదించారు. వీరు పొందిన ఉపాధిగురించి వీరి మాటల్లో...
Unemployees succeeded through job mela

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా డిగ్రీ విద్యార్థులకు పలు కోర్సుల్లో, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పొందిన వారికి జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగా వకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి పొందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రముఖ కంపెనీలను జాబ్‌మేళాలకు తీసుకువచ్చి మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు యువతకు అందిస్తున్నాం.

– ఎ.కృష్ణారెడ్డి, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్‌, భీమవరం

G-20 Summit: G20 ఎప్పుడు, ఎందుకు ప్రారంభించారో తెలుసా!

ఉద్యోగం రావడం ఆనందం

నేను నరసాపురం పీఎం లంక స్కిల్‌ కళాశాలలో ఐదు నెలలపాటు ఫోర్‌మెన్‌ ఎలక్ట్రికల్‌ వర్క్‌ కోర్సులో శిక్షణ పొందాను. స్కిల్‌ కళాశాల నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో నెల్లూరు సీఈటెక్‌ సోలార్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాను. నాకు నెలకు రూ.20 వేలు జీతం వస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, పశ్చిమగోదావరి స్కిల్‌ డెవలమెంట్‌ ప్రోగ్రామ్‌ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నా.

– శివగణేష్‌, అయినవల్లి

Job Mela: ఉద్యోగ అవ‌కాశం... అర్హులంద‌రూ దీనిని వినియోగించండి

బ్యాంకు మిత్రగా కొలువు

మాది వ్యవసాయ కుటుంబం. నేను డిగ్రీ పూర్తి చేశాను. ప్రభుత్వం నిర్వహించిన జాబ్‌మేళా ద్వారా ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌లో రూరల్‌ బ్యాంకుమిత్రగా ఉద్యోగం పొందాను. నెలకు రూ.17,259 జీతం తీసుకుంటున్నా. ప్రభుత్వం జాబ్‌మేళా నిర్వహించడం ద్వారా నాకు ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వం నిరుద్యోగులకు వృత్తి శిక్షణ ఇవ్వడంతో పాటు జాబ్‌మేళాలు నిర్వహించడం బాగుంది.

– ఎన్‌.శ్రీను, మల్లవరం

Internship and Job offer: ట్రిపులైటీ విద్యార్థుల‌కు ఇంటర్న్‌షిప్ తోపాటు ఉద్యోగం

#Tags