Job Mela: ఉద్యోగ అవకాశం... అర్హులందరూ దీనిని వినియోగించండి
![Job mela by Aadi traders company](/sites/default/files/images/2023/09/12/job-mela-1694496812.png)
సాక్షి ఎడ్యుకేషన్: ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని నెహ్రూ యువ కేంద్రంలో మంగళవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి పీబీ సాయిశ్రీనివాస్ చెప్పారు. ఎచ్చెర్లలోని స్కిల్ కళాశాలలో ఆదివారం వివరాలు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని, 30 ఏళ్ల లోపు యువత అర్హులని తెలిపారు.
Jobs in APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ, నెల్లూరు జోన్‌లో 300 ఉద్యోగాలు .. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
విశాఖపట్నం, భీమవరం, ఈస్ట్ గోదావరి కేంద్రాలుగా పనిచేస్తున్న ఆదిట్రేడర్స్ కంపెనీ ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోందని తెలిపారు. డిగ్రీ యువత అర్హులు కాగా, మొద టి మూడు నెలలు రూ. 10 వేలు, తర్వాత రూ. 15 వేలు నుంచి రూ. 18 వేల వరకు వేతనం లభిస్తుందని అన్నారు. పూర్తి వివరాలకు అర్హులైన యువత ఫోన్ నంబర్ 9703460880ను సంప్రదించాలని తెలిపారు.