Skip to main content

Vice- President Interacts with Faculty & Students of IIT HYD : విద్యార్థులు ఫోక‌స్ చేయాల్సిన Future Technologies ఇవే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : పరిశోధన శక్తిని పెంపొందించడం ద్వారానే ప్రపంచంతో భారత్ పోటీ పడుతుందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్ అభిప్రాయపడ్డారు.
Jagdeep Dhankhar, Vice President of India  Jagdeep Dhankhar discussing research and innovation

ఈ దిశగా కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని, IIT , IIMలు కృషి చేయలని అయన సూచించారు. హైదరాబాద్ - IITని ఆయన ఆదివారం సందర్శించారు. విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు Artificial Intelligence, Quantum computing, Clean Hydrogen Mission మరియు  Commercialization of 6G అభివృద్ధి పై  ద్రుష్టి పెట్టాలని సూచించారు. భారత  భవిష్యత్తును, గొప్ప శక్తిగా ఎదగాలన్న ఆకాంక్షను ప్రతి ఒక్కరు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. పశ్చిమ దేశాల పురోగతిని గమనించాలని కోరారు. ప్రపంచంలోనే అత్యున్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు భారత పరిశోధనలు, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు.

పార్లమెంట్ లో మేధోమధనం పై జరిగే చర్చలకు ఐటీ విద్యార్థులు, ప్రొఫెసర్ లను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, IIT బోర్డు అఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి,  IIT డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి పలువురు పాల్గొన్నారు.

Published date : 11 Mar 2025 10:10AM

Photo Stories