Internship and Job offer: ట్రిపులైటీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తోపాటు ఉద్యోగం
Sakshi Education
విద్యార్థులకు ఏడాది కోసం ఇంటర్న్‌షిప్ కల్పించారు. అందులో భాగంగా వారికి తగిన ట్రైనింగ్ ఇస్తారు. అదే కంపెనీలో, వారి అర్హతలను పరీక్షించి ఉద్యోగాలు అందజేస్తారు.
Internship and Job offer for IIIT students
సాక్షి ఎడ్యుకేషన్: నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన మెటీరియల్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారు. కాకినాడలోని శ్రీ భవాని కాస్టింగ్ లిమిటెడ్‌లో ఒక ఏడాది కాలానికి వీరు ఇంటర్న్‌షిప్‌కు ఎంపికకాగా, ఈ కాలంలో కంపెనీ వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేల స్టైఫండ్ అందజేయనుంది.