Skill Development Colleges: అరకులో స్కిల్‌ కళాశల.. నిరుద్యోగులకు శిక్షణతో ఉపాధి అవకాశాలు

అడవి బిడ్డలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో ఉద్యోగ యజ్ఞం నిర్విరామంగా సాగుతోంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ స్కిల్‌ కళాశాలలు ప్రారంభించింది ప్రభుత్వం. ఈ విధంగా పలువురు యువత, కళాశాలల్లో నైపుణ్య శిక్షణ అందుకొని ప్రస్తుతం ఉపాధి సాధించుకున్నారు..

చింతూరు: నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. శిక్షణ ఇచ్చి, అభ్యర్థులు నైపుణ్యం సంపాదించిన తరువాత పలు ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది.

CCTV at Girls School: బాలికల పాఠశాలలో సీసీ కెమేరాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

శిక్షణతో ఉపాధి పొందాడు..

హుకుంపేట మండలం తడిగిరి గ్రామానికి చెందిన పెనుమలి రవికిరణ్‌ పేద కుటుంబానికి చెందినవాడు. డిగ్రీ వరకు చదివినా సరైన ఉపాధి అవకాశాలు దొరకక నిరాశకు గురవుతున్న తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందాడు. దీంతో ఇతనికి విశాఖపట్నంలోని మౌరి టెక్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సొల్యూషన్స్‌ సంస్థలో ఏడాదికి రూ.1.45 లక్షల వేతనంతో ఉద్యోగం లభించడంతో ఆ పేద కుటుంబం కష్టాలు తీరినట్టయింది.

Oscars 2024 Winners Full List: 96వ ఆస్కార్ అవార్డులు.. విజేతల పూర్తి జాబితా ఇదే..

కొర్రా రమ్య.. ఫుడ్‌ అవుట్‌లెట్‌ మేనేజర్‌గా

జి.మాడుగుల మండలానికి చెందిన కొర్రా రమ్య డిగ్రీ వరకు చదువుకుంది. పేద కుటుంబానికి చెందిన వీరికి ఎలాంటి నెలసరి ఆదాయం లేదు. ఐదుగురు సభ్యులు గల ఈ కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ గురించి తెలుసుకున్న రమ్య అరకులోని స్కిల్‌ కళాశాలలో శిక్షణ తీసుకుంది. తిరుపతిలోని ఫార్చూన్‌ కెన్సెస్‌ సంస్థలో ఫుడ్‌ అవుట్‌లెట్‌ మేనేజర్‌గా రూ.15 వేల వేతనంతో ఉద్యోగం సంపాదించింది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు విస్తృతంగా చర్యలు తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించి, ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి.

Free Seats: పేద విద్యార్థులకు 25శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలి

స్కిల్‌ కళాశాల, హబ్‌ల ద్వారా శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అరకులో స్కిల్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో ఏర్పాటు చేసిన యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ద్వారా టూరిజం, హాస్పిటాలిటీ రంగం కింద ఫుడ్‌ అవుట్‌లెట్‌ మేనేజర్‌, హౌస్‌కీపింగ్‌ మేనేజర్‌ కోర్సుల్లో బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఐదు, ఆరు నెలలు శిక్షణ అందిస్తున్నారు. జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, అరకువ్యాలీలలో ఏర్పాటు చేసిన స్కిల్‌హబ్‌ల ద్వారా కూడా నిరుద్యోగ యువతకు శిక్షణనిస్తున్నారు. ఐటీ, ఆటోమోటివ్‌, హెల్త్‌కేర్‌ రంగాల కింద డొమెస్టిక్‌ డాటా ఎంట్రీ ఆపరేటర్‌, టూవీలర్‌ సర్వీస్‌ టెక్నీషియన్‌, జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌, ఎలక్ట్రికల్‌ వెహికల్‌ మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌ వంటి కోర్సుల్లో ఇక్కడ శిక్షణనిస్తున్నారు.

Changes in Schools: కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా వసతులు

జాబ్‌మేళాల ద్వారా ఉపాధి

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మెగా, మినీ జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ జాబ్‌మేళాల్లో ఆంధ్రా, తెలంగాణాకు చెందిన వివిధ కంపెనీలు పాల్గొని తమ సంస్థల్లో నియామకాలకు నిరుద్యోగ యువతను ఎంపిక చేసుకునేలా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కృషి చేస్తోంది. దీనికోసం ఆయా ప్రాంతాల్లోని ఐటీడీఏలు, ఇతర శాఖల సమన్వయంతో జాబ్‌మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువత పాల్గొనేలా చర్యలు చేపడుతోంది. 2022–24 సంవత్సరాల మధ్య జిల్లాలో 9 మెగా జాబ్‌మేళాలు, 13 మినీ జాబ్‌మేళాలు నిర్వహించి ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రధానమంత్రి కౌసల్య వికాస యోజన(పీఎంకేవీవై) కింద కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

CBSE Board Exams 2024: 10, 12వ తరగతి ప్రాక్టికల్‌ పరీక్షలు.. గడువు పొడిగిస్తూ సీబీఎస్‌ఈ నిర్ణయం

నియామకాలు ఇలా..

జిల్లాలో నిర్వహించిన జాబ్‌మేళాల్లో ఐదువేల మంది నిరుద్యోగ యువత పాల్గొనగా 1,600 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. అరకులోని స్కిల్‌ కళాశాలలో 150 మందికి శిక్షణ ప్రారంభించగా ఇప్పటికే 81 మందికి ఉద్యోగాలు లభించాయి. మిగతావారు ఇంకా శిక్షణ పొందుతున్నారు. ప్రధానమంత్రి కౌశల్య వికాస యోజన కింద 513 మందికి శిక్షణ ప్రారంభించగా 268 మందికి ఉద్యోగాలు లభించగా, మిగతావారు శిక్షణ పొందుతున్నారు. స్కిల్‌హబ్‌ల ద్వారా ఇప్పటివరకు 107 మంది నిరుద్యోగులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు.

Female Government Jobs 2024 Updates : ప్ర‌భుత్వ ఉద్యోగాలు 47 శాతం మహిళలకే.. పురుషుల‌కు మాత్రం..

ఆనందంగా ఉంది

మారుమూల గ్రామంలో ఉంటున్న నాకు ప్రభుత్వ చొరవతో ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా ఉంది. నర్సింగ్‌ చేసిన నాకు విశాఖపట్నంలోని మదర్‌ అండ్‌ ఫాదర్‌ హోం నర్సింగ్‌ సర్వీసెస్‌ సంస్థలో రూ.16 వేల వేతనంతో ఉద్యోగం లభించింది.

– జాటోతు పావని, బూరుగువాయి, ఎటపాక మండలం

నైపుణ్య శిక్షణతో ఎంతో ఉపయోగం

అరకులోని స్కిల్‌ కళాశాలలో పొందిన నైపుణ్య శిక్షణ ఉపాధికి ఎంతగానో దోహదపడింది. దీనిద్వారా తిరుపతిలో ఉద్యోగం సంపాదించాను. నా ఉద్యోగం నా కుటుంబ పోషణకు ఎంతో మేలు చేకూరుస్తోంది.

– మజ్జి విజయ్‌కుమార్‌, అరకు

Team India Rankings: మూడు ఫార్మాట్‌లలో నెంబర్‌వ‌న్‌గా టీమిండియా!

సద్వినియోగం చేసుకోవాలి

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల ద్వారా యువతకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. జాబ్‌మేళాల ద్వారా కూడా వివిధ కంపెనీలను పిలిపించి ఉపాధి కల్పిస్తున్నాం. జిల్లాలోని నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. – ప్రశాంత్‌కుమార్‌,

జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారి

#Tags