Skip to main content

World Red Cross Day 2024: మే 8వ తేదీ ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం

ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 8న అంతర్జాతీయ రెడ్‌క్రాస్, రెడ్‌క్రెసెంట్ ఉద్యమం యొక్క మానవతావాద కార్యకలాపాలను, సూత్రాలను గౌరవించడానికి జరుపుకుంటారు.
World Red Cross and Red Crescent Day 2024

ఈ రోజు రెడ్‌క్రాస్, రెడ్‌క్రెసెంట్ ఉద్యమం యొక్క విలువలు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సహాయం చేయడానికి వారు చేసే పనిని గుర్తుంచుకోవడానికి ఒక అవకాశం.

ఈ సంవత్సరం థీమ్ "నేను సంతోషంతో ఇస్తాను, నేను ఇచ్చే ఆనందమే నాకు బహుమతి(I give with joy, and the joy I give is a reward)". 

దీని చరిత్ర ఇదే..
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం శాంతి, స్థిరత్వానికి ఆరాటపడింది. ఈ ప్రయత్నాల నుంచి రెడ్‌క్రాస్ ఉద్యమం పుట్టుకొచ్చింది. 1934లో టోక్యోలో జరిగిన 15వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో, యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు సహాయం చేయడానికి ఒక ఒప్పందం రూపొందించబడింది. ఈ ఒప్పందం 1946లో రెండవ ప్రపంచ యుద్ధంలో అమలు చేయబడింది.

World Press Freedom Day 2024: మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

నోబెల్ పురస్కార గ్రహీత, రెడ్‌క్రాస్ సొసైటీల లీగ్ గవర్నర్స్ బోర్డు రెడ్‌క్రాస్, అంతర్జాతీయ రెడ్‌క్రాస్(ICRC) సొసైటీ వ్యవస్థాపకుడు జాన్‌ హెన్రీ డ్యూనాంట్  మే 8వ తేదీ(1828 సంవ‌త్స‌రం) జన్మించిన రోజే జరుపుకోవాలని ప్రతిపాదించింది. మొదటి రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని మే 8, 1948న జరుపుకున్నారు. 1984లో అధికారికంగా దీనికి ‘వరల్డ్ రెడ్ క్రాస్ డే’ అని పేరు పెట్టారు. 

Published date : 10 May 2024 01:25PM

Photo Stories