Free Seats: పేద విద్యార్థులకు 25శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలి
పాడేరు: విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించనున్నామని డీఈవో బ్రహ్మాజీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటవ తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైందని పేర్కొన్నారు. ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్సీ,స్టేట్‌సిలబస్ అమలవుతున్న ప్రైవేట్, ఎయిడెడ్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద పిల్లలకు ఉచితంగా కేటాయిస్తున్నట్టు తెలిపారు.
CCTV at Girls School: బాలికల పాఠశాలలో సీసీ కెమేరాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం
ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈనెల 25 వరకు గడువు పొడిగించిందని పేర్కొన్నారు. హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, వెనుకబడిన సమూహాలు (బీసీ,మైనార్టీ,ఓసీ)లకు 6 శాతం సీట్లు కేటాయించినట్టు తెలిపారు. రూరల్ ఏరియాలో సంవత్సర ఆదాయం రూ.1.20 లక్షలు, అర్బన్ ఏరియాలో రూ.1.44 లక్షల ఆదాయానికి లోబడిన కుటుంబాల విద్యార్థులు ఈ ఉచిత సీట్లకు అర్హులు. cre.ap.gov.in వెబ్‌సైట్‌లో విద్యార్థులు వివరాలను నమోదు చేయాలి.
2 Lakh Jobs Guarantee : 2 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ, ఇప్పటికే 31వేల ఉద్యోగాల భర్తీ
దరఖాస్తు సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల గుర్తింపు కార్డులు జత చేయాలి. ఏప్రిల్ ఒకటవ తేదీన లాటరీ ద్వారా అర్హులైన విద్యార్థుల తొలి జాబితా విడుదల చేస్తామని, ఏప్రిల్ 2 నుంచి 10వ తేదీ వరకు అడ్మిషన్లను ఫైనల్ చేసి, ఏప్రిల్ 15న లాటరీ ద్వారా రెండవ లిస్ట్‌ను ప్రకటిస్తామని డీఈవో తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 23వ తేదీ వరకు ఆయా ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఖరారు చేస్తామని పేర్కొన్నారు.
KGBV Admissions: ఈ నెల 12 నుంచి కేజీబీవీలో ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం
జిల్లాలోని అర్హులైన పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో తమ పిల్లల పేర్లను నమోదు చేసి,నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయం సీఎంవో ప్రకాష్ (ఫోన్ నంబర్ 8985646737)ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.