KGBV Admissions: ఈ నెల 12 నుంచి కేజీబీవీలో ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం
![Academic year 2024-25 admissions at KGBV Classes 6 and 11 admissions open at KGBV Apply online for admissions at KGBV, Anantapur Kasturba Gandhi Girls Vidyalayas admission announcement Admissions for Girls at Kasturba Gandhi Balika Vidhyalaya from March 12](/sites/default/files/images/2024/09/12/kgbv-admissions-online-1726133655.jpg)
అనంతపురం: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6, 11వ తరగతుల్లో ప్రవేశానికి, 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 12 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ వరలక్ష్మీ, సమగ్ర శిక్ష ఏపీసీ వరప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు.
2 Lakh Jobs Guarantee : 2 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ, ఇప్పటికే 31వేల ఉద్యోగాల భర్తీ
అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన పిల్లలు) నిరుపేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. https://apkgbv.apcfss. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆర్టీఈ టోల్‌ఫ్రీ నంబరు 18004258599కు కాల్ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Students at Entrance Exam: గురుకుల ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య..!
Tags
- KGBV Schools
- girls school
- admissions
- registrations
- online applications
- District Education Officer Varalakshmi
- School admissions
- students education
- Education News
- Sakshi Education News
- ananthapur news
- Anantapur KGBV
- Academic admissions
- DEO Varalakshmi statement
- Online application process
- SakshiEducationUpdates