CCTV at Girls School: బాలికల పాఠశాలలో సీసీ కెమేరాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం
కొయ్యూరు: బాలికల పాఠశాలల్లో సీసీ కెమేరాలను ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బాలికల ప్రత్యేక రక్షణను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కెమేరాలను ఏర్పాటు చేసింది. ఒక్కో పాఠశాలలో పది సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రహరీ వద్ద, ప్రధాన గేటు, పాఠశాల ఆవరణలో, కారిడార్ ఇతరత్రా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మెయిన్ నెట్‌వర్క్ ద్వారా కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీ కంప్యూటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. పాఠశాలల్లో బాలికల రక్షణ, భద్రతకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విద్యార్థినుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Students at Entrance Exam: గురుకుల ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య..!
ప్రక్రియ పూర్తయింది
బాలికల పాఠశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది.దీంతో బాలికలకు మరింత భద్రత పెరుగుతుంది. పాఠశాలల్లో బాలికల భద్రతపై పూర్తి నిఘా ఉంటుంది. పాఠశాలలో బయట వ్యక్తుల ప్రవేశం లేకుండా వీలు కలుగుతుంది.
– కొండలరావు, డీడీ, గిరిజన సంక్షేమ శాఖ, పాడేరు
KGBV Admissions: ఈ నెల 12 నుంచి కేజీబీవీలో ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం
Tags
- girls school
- CCTV Camera
- AP government
- girl student safety
- Tribal Welfare Department
- Kondala Rao
- School HM Gopalam
- Student education
- Education News
- Sakshi Education News
- anakapalle news
- Community support
- Parental approval
- CCTV installation
- Government initiative
- Safety precautions
- surveillance
- Girls' education
- Protection measures
- SakshiEducationUpdates