Team India Rankings: వన్డే, టి20, టెస్టులోనూ టీమిండియానే నెంబర్‌వన్!!
Sakshi Education
టీమిండియా అద్భుత ఘనత సాధించింది. టెస్ట్‌లు, వన్డేలు, టీ-20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుని చరిత్ర సృష్టించింది.
భారతదేశంలో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా తాజాగా ఐసీసీ (ICC) ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది.
టెస్ట్ ర్యాంకింగ్స్..
- స్వదేశంలో ఇంగ్లండ్‌ను 4-0తో ఓడించిన టీమిండియా 122 రేటింగ్ పాయింట్లతో టాప్ స్థానానికి చేరుకుంది.
- ఆస్ట్రేలియా (117 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయింది.
- ఓటములతో భారీ దెబ్బతిన్న ఇంగ్లండ్ (111 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచింది.
- ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో కూడా టీమిండియా 68.5% విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది.
వన్డే ర్యాంకింగ్స్..
- 121 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
- ఆస్ట్రేలియా (118 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది.
BCCI: ఆరేళ్ల తర్వాత మహిళా క్రికెటర్లకు దేశవాళీ రెడ్ బాల్ టోర్నీ
టీ-20 ర్యాంకింగ్స్..
- టీమిండియా 266 రేటింగ్ పాయింట్లతో టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంది.
- ఇంగ్లండ్ (256 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది.
Published date : 11 Mar 2024 01:09PM