BCCI: ఆరేళ్ల తర్వాత మహిళా క్రికెటర్లకు దేశవాళీ రెడ్ బాల్ టోర్నీ
Sakshi Education
భారత దేశవాళీ క్యాలెండర్‌లో మహిళా క్రికెటర్ల కోసం ఆరేళ్ల తర్వాత రెడ్ బాల్ టోర్నీని నిర్వహించనున్నారు.
మార్చి 28 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పుణేలో ఈ టోర్నీ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. మొత్తం ఆరు జోనల్ జట్లు (ఈస్ట్, నార్త్ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, నార్త్, సౌత్‌జోన్) ఈ టోర్నీలో పోటీపడతాయి.
ప్రతి మ్యాచ్ మూడు రోజులపాటు జరుగుతుంది. నార్త్, సౌత్ జోన్ జట్లకు నేరుగా సెమీఫైనల్ బెర్త్‌లు లభించగా.. ఈస్ట్–నార్త్ ఈస్ట్, వెస్ట్–సెంట్రల్ జోన్ జట్ల మధ్య నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో గెలిచిన జట్లు సెమీఫైనల్స్‌లో నార్త్, సౌత్ జోన్ జట్లతో ఆడతాయి. చివరిసారి 2018లో మహిళా క్రికెటర్లకు రెడ్ బాల్ టోర్నీని ఏర్పాటు చేయగా.. ఆ సమయంలో రెండు రోజుల మ్యాచ్‌లు నిర్వహించారు.
Para Badminton World Championship: పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 18 పతకాలు..
Published date : 02 Mar 2024 11:30AM