Skip to main content

Para Badminton World Championship: పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 18 పతకాలు..

పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ షట్లర్లు మొత్తం 18 పతకాలు సాధించారు.
India ends Para Badminton World Championships campaign with 18 medals

ఇందులో మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్‌లో ఎస్‌ఎల్‌–4 విభాగంలో ఐఏఎస్‌ అధికారి సుహాస్‌ యతిరాజ్‌.. ఎస్‌ఎల్‌–3 విభాగంలో ప్రమోద్‌ భగత్‌.. ఎస్‌హెచ్‌–6 విభాగంలో కృష్ణ నాగర్‌ పసిడి పతకాలు సొంతం చేసుకొని ప్రపంచ చాంపియన్స్‌గా అవతరించారు. 
ఫైనల్స్‌లో సుహాస్‌ 21–18, 21–18తో ఫ్రెడీ సెతియవాన్‌ (ఇండోనేసియా)పై, ప్రమోద్‌ 14–21, 21–15, 21–14తో డేనియల్‌ బెథెల్‌ (ఇంగ్లండ్‌)పై, కృష్ణ నాగర్‌ 22–20, 22–20తో లిన్‌ నైలీ (చైనా)పై గెలుపొంది విజేతలుగా నిలిచారు.

 

Published date : 26 Feb 2024 04:55PM

Photo Stories