Changes in Schools: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వసతులు
Sakshi Education
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని విధాలుగా వసతులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాడు-నేడు పథకంతో అభివృద్ది పనులను ప్రారంభించారు.
అన్నమయ్య: నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంతగా విద్యాభివృద్ధికి, విద్యావ్యవస్థ పటిష్టానికి చొరవ చూపలేదు. అదనపు తరగతి గదులను నిర్మించడంతో పాటు సురక్షిత తాగునీరు, తరగతి గదులలో లైటింగ్, ఫ్యాన్‌లు, ప్రహరీలు, బెంచీలు, అధునాతన టాయిలెట్‌లు తదితర అన్ని సౌకర్యాలు కల్పించారు.
Free Seats: పేద విద్యార్థులకు 25శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలి
కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఏర్పాటు చేశారు. క్వాలిటీతో వాల్ పెయింటింగ్ వేయించి అందంగా తయారు చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆసక్తిగా పాఠశాలకు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు.
– హెచ్.సుబ్బన్న, ఉపాధ్యాయుడు, ఎంపీయూపీ స్కూల్, ప్రకాష్‌నగర్, ప్రొద్దుటూరు
Published date : 11 Mar 2024 12:28PM