Agniveer MR Notification : అగ్నివీర్‌–ఎంఆర్‌ నోటిఫికేషన్‌.. పదో తరగతి అర్హతతో పోటీ పడే అవకాశం!

పదో తరగతి ఉత్తీర్ణులకు నావికా దళం స్వాగతం పలుకుతోంది! ఎంపికైతే నాలుగేళ్ల పాటు నేవీలో ఉద్యోగానికి అవకాశం కల్పిస్తుంది..

ఇందుకోసం ఇండియన్‌ నేవీ తాజాగా అగ్నివీర్‌–ఎంఆర్‌ (మ్యుజిషియన్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇండియన్‌ నేవీ అగ్నివీర్‌ (ఎంఆర్‌)–మ్యుజిషియన్‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ తదితర వివరాలు.. 

అగ్నివీర్‌ ఎంఆర్‌ అంటే

త్రివిధ దళాల్లో ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా అగ్నివీర్‌ (ఎంఆర్‌), అగ్నివీర్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) పేరుతో నియామకాలు జరుపుతున్నారు. అదేవిధంగా మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌) పేరుతో నేవీ నియామకాలు చేపడుతోంది. వీటికి పదో తరగతి ఉత్తీర్ణతను అర్హతగా నిర్దేశించారు. తాజాగా ఎంఆర్‌ మ్యుజిషియన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

Group 1 Free Coaching : గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా కోచింగ్‌తో పాటు స్టైఫండ్‌

రెండు వేల పోస్ట్‌లు
నేవీ అగ్నివీర్‌ (ఎంఆర్‌)–మ్యుజిషిన్‌ నోటిఫికేషన్‌ 2/2024 ద్వారా దాదాపు రెండు వేల పోస్ట్‌లను భర్తీ చేసే అవకాశమున్నట్లు సమాచారం. వీటిలో మహిళలకు కూడా నిర్దేశిత సంఖ్యలో పోస్ట్‌లను కేటాయిస్తారు. అవివాహితులైన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పదో తరగతి అర్హత
➤    నేవీ అగ్నివీర్‌ (ఎంఆర్‌)–మ్యుజిషియన్‌ పోస్ట్‌లకు పదో తరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు మ్యూజికల్‌ ఎబిలిటీ కూడా ఉండాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాడటం, ఆయా మ్యూజిక్‌ పరికరాలపై వాయిద్య నైపుణ్యాలను పరిశీలిస్తారు. కీ బోర్డ్, స్ట్రింగ్‌/విండ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌/డ్రమ్‌ కిట్‌లపై ఉన్న పట్టును పరిశీలిస్తారు.
➤    వయసు: నవంబర్‌ 1, 2002–ఏప్రిల్‌ 30, 2007 మధ్యలో జన్మించి ఉండాలి.
➤    కనీస ఎత్తు: పురుషులు 158 సెంటీ మీటర్లు, మహిళలు 152 సెంటీ మీటర్లు ఉండాలి.

Apprenticeship Training : నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1104 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. అర్హులు వీరే!

అనుభవం సర్టిఫికెట్‌
అగ్నివీర్‌ (ఎంఆర్‌)–మ్యుజిషియన్‌ పోస్ట్‌లకు.. మ్యూజికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. హిందుస్తానీ, సంప్రదాయ సంగీతం లేదా విండ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ కళాకారులు గుర్తింపు పొందిన మ్యూజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. ఇతర వాయిద్యాలకు సంబంధించిన అభ్యర్థులు ఆయా ఈవెంట్లలో పాల్గొన్నట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్లు లేదా అవార్డ్‌ల సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది.

రెండు దశల ఎంపిక ప్రక్రియ
అగ్నివీర్‌ (ఎంఆర్‌) పోస్ట్‌ల భర్తీలో భాగంగా రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలిదశలో.. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, మ్యూజిక్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. వీటిలో విజయం సాధించిన వారికి రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు.

ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌
➤    ఎంపిక ప్రక్రియలో కీలకంగా నిలిచే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో భాగంగా పలు ఈవెంట్లలో పోటీ నిర్వహిస్తారు.
➤    1.6 కిలో మీటర్ల పరుగు: పురుష అభ్యర్థులు 6 నిమిషాల 30 సెకన్లలో, మహిళా అభ్యర్థులు ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేయాలి.
➤    స్క్వాట్స్‌: పురుష అభ్యర్థులు 20, మహిళా అభ్యర్థులు 15 స్క్వాట్స్‌ చేయాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు 12 పుషప్స్‌ చేయాలి. మహిళా అభ్యర్థులు 10 బెంట్‌నీ సిటప్స్‌ పూర్తి చేయాలి.

Govt Degree College: పేరుకే ప్రభుత్వ డిగ్రీ కళాశాల!

ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ
రాత పరీక్ష, పీఈటీలలో ప్రతిభ చూపిన వారికి చివరగా మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ఆరు నెలలపాటు శిక్షణనిస్తారు. తాజా బ్యాచ్‌కు సంబంధించిన శిక్షణ నవంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ శిక్షణ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. ఆయా విభాగాల్లో విధులు కేటాయిస్తారు. అన్ని ప్రక్రియల్లో విజయం సాధించి.. కొలువులు సొంతం చేసుకున్న వారికి నేవీ మ్యూజిక్‌ విభాగంలో నాలుగేళ్లపాటు విధులు నిర్వర్తించే అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో వారికి అగ్నిపథ్‌ స్కీమ్‌ను అనుసరించి వేతనం అందిస్తారు.

25 శాతం మందికి
నాలుగేళ్ల వ్యవధిలో అగ్నివీర్‌ సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారిలో 25 శాతం మందిని నేవీలో శాశ్వత హోదాలో సెయిలర్‌గా నియమిస్తారు. అందుకోసం ప్రత్యేక నోటిఫికేషన్‌ వెలువరిస్తారు. అందులో పే­ర్కొన్న ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుంది. అదే విధంగా అగ్నివీర్‌లుగా సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారికి∙సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్‌ నియామకాల్లోనూ పది శాతం రిజర్వేషన్‌ కల్పిస్తారు.

Apprentice Posts : యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు.. వివ‌రాలు ఇలా..

వేతనం ఇలా
అగ్నివీర్‌ (ఎంఆర్‌)–మ్యూజిషియన్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఏడాది ప్రాతిపదికగా నాలుగేళ్ల పాటు ఒక్కో ఏడాది ఒక్కో మొత్తంలో నెల వేతనం అందిస్తారు. మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40 వేలు చొప్పున నెల వేతనం లభిస్తుంది. ఈ వేతనంలోంచి ప్రతి నెల 30 శాతం చొప్పున అగ్నివీర్‌ కార్పస్‌ ఫండ్‌కు జమ చేస్తారు. ఈ 30 శాతానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్పస్‌ ఫండ్‌కు జమ చేస్తుంది. ఇలా నాలుగేళ్లు పూర్తయ్యే సరికి అభ్యర్థుల కార్పస్‌ ఫండ్‌లో రూ.10.04 లక్షలు జమ అవుతాయి.
వేతనంతోపాటు రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్‌ అలవెన్స్, ట్రావెల్‌ అలవెన్స్‌లను కూడా అందిస్తారు. దీంతోపాటు నాన్‌ –కంట్రిబ్యూటరీ జీవిత బీమా పేరుతో రూ.48 లక్షల మొత్తానికి జీవిత బీమా కల్పిస్తారు. అదేవిధంగా విధి నిర్వహణ సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే మరో రూ.44 లక్షల పరిహారం అందిస్తారు.

పట్టు సాధించేలా
అగ్నివీర్‌ (ఎంఆర్‌)–మ్యుజిషియన్‌ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే వారు.. తమకు ప్రావీణ్యం ఉన్న సంగీత విభాగాల్లో పట్టు సాధించేలా కృషి చేయాలి. పాటకు తగిన రీతిలో సంగీతం అందించేలా ఆయా వాయిద్య పరికరాలతో ప్రాక్టీస్‌ చేయాలి. రాత పరీక్ష లేకుండా.. కేవలం మ్యూజికల్‌ ఎబిలిటీని పరిశీలించే నేపథ్యంలో ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.

Sakshi Spell Bee & Math Bee: చిన్నారుల ప్రతిభకు పట్టం

ముఖ్య సమాచారం
➤    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
➤    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూలై 11.
➤    స్టేజ్‌–1 పరీక్ష తేదీ: ఆగస్ట్‌లో నిర్వహించే అవకాశం.
➤    స్టేజ్‌–2 పరీక్ష తేదీ: సెప్టెంబర్‌లో జరిగే అవకాశం.
➤    తుది జాబితా/ఫలితాల విడుదల: 2024, అక్టోబర్‌.
➤    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

Indian Air Force Jobs: ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ వాయు నియామకాలకు దరఖాస్తులు

#Tags