Indian Polity Bit Bank For All Competitive Exams: భారతదేశ పాలన బ్రిటిష్ చక్రవర్తి పరిధిలోకి వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసిన రోజు ఏది?
1. 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో కింది వాటిలో సరికానిది?
ఎ) ఈస్టిండియా కంపెనీ వాణిజ్య కార్యకలాపాల రద్దు
బి) కౌన్సిల్‌లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం
సి) కౌన్సిల్లో న్యాయ చట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్ ఇచ్చింది
డి) గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు
- View Answer
- సమాధానం: డి
2. కింది వాటిలో సరైంది?
ఎ) బ్రిటన్ తరహాలో భారతదేశంలో రెగ్యులర్ పోలీసు దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ వారె¯Œ హేస్టింగ్స్
బి) రెగ్యులేటింగ్ చట్టం1773 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు ప్రతిపాదన
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
3. భారత ప్రభుత్వ చట్టం1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి?
ఎ) రెండు
బి) మూడు
సి) అయిదు
డి) ఆరు
- View Answer
- సమాధానం: బి
4. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?
ఎ) వాట్సన్
బి) రాబర్డ్ క్లైవ్
సి) డూప్లెక్స్
డి) వారెన్ హేస్టింగ్స్
- View Answer
- సమాధానం: బి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక ఉప రాష్ట్రపతి ఎవరు?
5. భారతదేశ పాలన బ్రిటిష్ చక్రవర్తి పరిధిలోకి వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసిన రోజు?
ఎ) 1858 నవంబర్ 1
బి) 1857 నవంబర్ 1
సి) 1859 డిసెంబర్ 1
డి) 1857 డిసెంబర్ 1
- View Answer
- సమాధానం: ఎ
6. భారత ప్రభుత్వ చట్టం1919లోని ప్రధాన అంశం/అంశాలు?
ఎ) రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం
బి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారాల నిర్వచనం
సి) కేంద్ర, రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికార సంక్రమణం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. పాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించటానికి ఉద్దేశించిన మొదటి బ్రిటిష్ చట్టం?
ఎ) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం 1861
బి) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం1862
సి) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం 1909
డి) భారత ప్రభుత్వ చట్టం 1919
- View Answer
- సమాధానం: ఎ
8. 'గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం'గా నెహ్రూ దేన్ని పేర్కొన్నారు?
ఎ) కేబినెట్ మిషన్
బి) మౌంట్‌బాటన్ ప్రణాళిక
సి) వేవెల్ ప్రణాళిక
డి) భారత ప్రభుత్వ చట్టం1935
- View Answer
- సమాధానం: డి
9. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం?
ఎ) అమెరికా రాజ్యాంగం
బి) బ్రిటిష్ రాజ్యాంగం
సి) ఐరిష్ రాజ్యాంగం
డి) భారత ప్రభుత్వ చట్టం
- View Answer
- సమాధానం: డి
10. జతపరచండి.
1) పోర్ట్ ఫోలియో పద్ధతి
2) సివిల్ సర్వీసులు
3) మత నియోజక వర్గాలు
4) భారత న్యాయ సంస్కరణలు
ఎ) లార్డ్ మెకాలే
బి) లార్డ్ కార్న్ వాలిస్
సి) లార్డ్ కానింగ్
డి) లార్డ్ మింటో
ఎ) 1సి, 2బి, 3డి, 4ఎ
బి) 1బి, 2సి, 3ఎ, 4డి
సి) 1డి, 2ఎ, 3బి, 4సి
డి) 1ఎ, 2బి, 3డి, 4సి
- View Answer
- సమాధానం: ఎ
11. కాలక్రమం ప్రకారం కింది వాటిని గుర్తించండి?
1) ప్రత్యేక నియోజకవర్గాలు
2) శాసన అధికారాల బదలాయింపు
3) ద్విసభా విధానం
4) డొమినియన్ ప్రతిపత్తి
ఎ) 1, 2, 3, 4,
బి) 2, 1, 3, 4
సి) 3, 2, 1, 4
డి) 3, 4, 1, 4
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: Constitution of India Notes for Competitive Exams: అర్ధరాత్రి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న వేళ..
12. ప్రభుత్వానికి ఉండే అధికారం దేనికి ఉదాహరణ?
ఎ) సంప్రదాయ అధికారం
బి) సమ్మోహనాధికారం
సి) చట్టబద్ధ, హేతుబద్ధ అధికారం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి