Indian Polity Bit Bank For All Competitive Exams: బ్రిటిషర్లు ఏ సంవత్సరంలో బెంగాల్లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు?
1. భారతప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉండేది?
ఎ) బ్రిటిష్రాణి/ రాజు
బి) ఇంగ్లండు పార్లమెంటు
సి) సమాఖ్య శాసనసభ
డి) కౌన్సిల్లోని గవర్నర్ జనరల్
- View Answer
- సమాధానం: డి
2. 1773 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఏమని పిలుస్తారు?
ఎ) చార్టర్ చట్టాలు
బి) కౌన్సిల్ చట్టాలు
సి) క్రౌన్ చట్టాలు
డి) పైవేవీకావు
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: Indian Polity Notes for Competitive Exams: రాజ్యాంగ వికాసంలో భాగమైన చట్టాలు..
3. 1946 సెప్టెంబరు 2న ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని మొదటిసారి ప్రతిపాదించింది?
ఎ) సైమన్ కమిషన్
బి) క్రిప్స్మిషన్
సి) వేవెల్ ప్లాన్
డి) కేబినెట్ మిషన్ ప్లాన్
- View Answer
- సమాధానం: డి
4. స్టాఫర్డ్ క్రిప్స్ కిందివాటిలో ఎందులో సభ్యుడు?
ఎ) కన్జర్వేటివ్ పార్టీ
బి) లిబరల్ పార్టీ
సి) లేబర్ పార్టీ
డి) అధికార శ్రేణి
- View Answer
- సమాధానం: సి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక ఉప రాష్ట్రపతి ఎవరు?
5. బ్రిటిషర్లు ఏ సంవత్సరంలో బెంగాల్లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు?
ఎ) 1776
బి) 1775
సి) 1777
డి) 1774
- View Answer
- సమాధానం: డి