APPSC Group 1 Cancelled 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ర‌ద్దుపై.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అభ్య‌ర్థుల భరోసాగా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) నిర్వ‌హించిన 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీ హైకోర్టు రద్దు చేసిన విష‌యం తెల్సిందే. అయితే 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయడంపై ఏపీ ప్ర‌భుత్వం స్పందించింది.

అభ్య‌ర్థులు ఆందోళ‌న చెందొద్ద‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే ఉద్యోగానికి ఎంపికై విధుల్లో ఉన్న‌ అభ్య‌ర్థుల త‌రుఫున న్యాయ‌పోరాటం చేస్తామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరతామని అంటోంది.

☛ APPSC Group 1 Hall Ticket 2024 : గ్రూప్–1 హాల్ టికెట్లు విడుద‌ల‌.. 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షలు.. ఈ సారి పోటీ మాత్రం..

ఏపీపీఎస్సీ కూడా..

2018లో 167 పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్‌ చేసింది ఏపీపీఎస్సీ. అయితే.. డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత రెండుసార్లు మూల్యాంకన చేశారంటూ హైకోర్టుని అశ్రయించిన కొందరు అభ్యర్ధులు. అయితే తాము నిబంధనల ప్రకారమే మూల్యాంకనం నిర్వహించామని ఏపీపీఎస్సీ వాదించింది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనల అనంతరం.. మళ్లీ మెయిన్స్‌ నిర్వహించాల్సిందేనని జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలిచ్చారు.

☛ APPSC Group-1 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

కార‌ణం ఇదే..
ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మెయిన్స్‌ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, రెండు సార్లు మూల్యాంకనం ఎందుకు చేశారని ప్రశ్నించింది.  ఇది చట్టవిరుద్ధమన్న కోర్టు.. మెయిన్స్‌ను రద్దు చేసింది. అంతేకాకుండా మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా రద్దుచేసింది. 6 నెలల్లో మెయిన్స్‌ తిరిగి నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

☛ APPSC Group-1 Total Applications 2024 : ఈ సారి ఏపీపీఎస్సీ గ్రూప్‌-1కు భారీగా ద‌ర‌ఖాస్తులు.. ఒక్కొక్క పోస్టుకు ఎంత మంది పోటీ అంటే..?

#Tags