Distance Education: దూరవిద్య డిగ్రీ ఫలితాల విడుదల,రీవాల్యుయేషన్ దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..
Sakshi Education
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలను వీసీ ప్రొఫెసర్ కె.హుస్సేన్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. బీఏలో మొత్తం 159 మంది పరీక్షకు హాజరు కాగా 104 మంది, బీకాంలో 22 మందికి గాను 13 మంది, బీకాం (కంప్యూటర్స్)లో 150 మందికి గాను 98 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు దూరవిద్య వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
రీవాల్యుయేషన్ దరఖాస్తుకు ఈ నెల 29 తుది గడువుగా నిర్ధేశించారు. ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున రీవాల్యుయేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, దూరవిద్య డైరెక్టర్ ప్రొఫెసర్ జి.బాలసుబ్రమణ్యం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కె.శ్రీరాములు నాయక్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.ఉమాపతి పాల్గొన్నారు.
Published date : 11 May 2024 03:23PM