Skip to main content

APPSC Group-1 Total Applications 2024 : ఈ సారి ఏపీపీఎస్సీ గ్రూప్‌-1కు భారీగా ద‌ర‌ఖాస్తులు.. ఒక్కొక్క పోస్టుకు ఎంత మంది పోటీ అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వ‌హించే గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు భారీగానే ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. మొత్తం 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
APPSC Group 1 Total Applications 2024 Details  APPSC Group-1 Job Notification    Group-1 Recruitment Updates APPSC    Group-1 Recruitment Updates APPSC   APPSC Notification for 81 Group-1 Vacancies   APPSC Group-1 Job Notification

జనవరి 28వ తేదీ రాత్రి 11:59 గంటల వ‌రకు ఈ గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తుల‌కు గడువు ఇచ్చిన విష‌యం తెల్సిందే. మొత్తం మీద ఈ 81 గ్రూప్‌-1 పోస్టుల‌కు 1,48,000 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కొక్క పోస్టుకు 1827 మంది పోటీప‌డుతున్నారు. గ‌తంతో పోలిస్తే ఈ సారి పోటీ తీవ్ర‌త చాలా ఎక్కువ‌గానే ఉంది. మార్చి 17వ తేదీన నిర్వహించే ప్రాథమిక పరీక్షలో ఎటువంటి మార్పు లేదన్నారు.

☛ APPSC Group-1 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

గ‌తంతో పోలిస్తే.. ఈ సారే..
2022లో ఏపీపీఎస్సీ 92 గ్రూప్‌-1 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా.. ఈ ఉద్యోగాల‌కు 1,26,449 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అలాగే 2018లో ఏపీపీఎస్సీ 182 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా.. ఈ పోస్టుల‌కు 1,14,473 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అంటే.. గ‌తంతో పాలిస్తే.. ఈ సారి 2023 గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌లోనే ఎక్కువ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.

ఈ సారి ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 81 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(సివిల్‌), డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌(పురుషులు), డివిజినల్‌/డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్స్, రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, కో–ఆపరేటివ్‌ సర్వీస్‌ డిప్యూటీ రిజిస్ట్రార్, మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌–1), అసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీస­ర్, డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఆడి­ట్‌ ఆఫీసర్‌ తదితర ఉన్నతస్థాయి పోస్టులు ఉన్నాయి.

చదవండి:  Group-1 Syllabus in Telugu: APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ సిలబస్ తెలుగులో... టాపిక్ ల వారీగా బిట్ బ్యాంక్ కోసం క్లిక్ చేయండి!!

గ్రూప్‌-1 ప‌రీక్షా విధానం : 
అభ్య‌ర్థుల‌ను.. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌ 120 ప్రశ్నలు–120 మార్కులు); పేపర్‌–2 (జనరల్‌ ఆప్టిట్యూడ్‌ 120 ప్రశ్నలు–120 మార్కులు).

మెయిన్‌ ఎగ్జామినేషన్ : 
గ్రూప్‌-1 మెయిన్‌లో అయిదు పే­పర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 150 మార్కులు చొప్పున 750 మార్కులకు మెయిన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. అవి.. పేపర్‌–1 జనరల్‌ ఎస్సే; పేపర్‌–2–ఏపీ, భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం; పేపర్‌–3–పాలిటీ, రాజ్యాంగం, పాలన, లా,ఎథిక్స్‌; పేపర్‌–4 ఎకానమీ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి; పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.. చివరగా 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

☛ APPSC Group-2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఈ సారి గ్రూప్‌-2లో పోటీ ఇలా..
ఈ సారి ఏపీపీఎస్సీ గ్రూప్‌-2కు దాదాపు 4,83,525 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 537 మంది పోటీప‌డుతున్నారు. గ్రూప్‌-2 స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించనున్నారు.

Published date : 31 Jan 2024 05:33PM

Photo Stories