Rita Sherpa: 29వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించిన కమీ రీటా షెర్పా
ఈ సీజన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన తొలి యాత్ర బృందం ఇదే. డెండి షెర్పా నేతృత్వంలోని పర్వాతారోహకుల బృందం మే 10వ తేదీ రాత్రి 8.15 గంటలకు 8,848.86 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది. ఈ విషయాన్ని ఈ పర్వతారోహణ యాత్ర నిర్వహణ సంస్థ ‘సెవెన్ సమ్మిట్ ట్రాక్’ ప్రతినిధి థాని గుర్గైన్ మీడియాకు తెలిపారు.
ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ సాధించని ఘనతను పర్వతారోహకురాలు కమీ రీటా షెర్పా చేసి చూపారు. ఆమె 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. షెర్పా తన 28వ ఎవరెస్ట్ అధిరోహణ రికార్డును తానే బద్దలు కొట్టారు. కమీ రీటా షెర్పాకు 54 ఏళ్లు. ఆమె 1994 నుంచి పర్వతాలను అధిరోహిస్తున్నారు.
World Largest Airport: ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం నిర్మాణం.. దీని పేరు ఏమంటే..
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే ముందు కమీ రీటా షెర్పా మీడియాతో మాట్లాడుతూ తనకు మరో వ్యాపకం లేదని, పర్వతారోహణే తన లక్ష్యమని అన్నారు. 29వ సారి కూడా ఎవరెస్ట్ అధిరోహిస్తానని తెలిపారు. కాగా కమీ రీటా షెర్పాతో పాటు టెన్జింగ్ గ్యాల్జెన్ షెర్పా, పెంబా తాషి షెర్పా, లక్పా షెర్పా, దావా రింజి షెర్పా, పామ్ సోర్జీ షెర్పా, సుక్ బహదూర్ తమాంగ్, నామ్‌గ్యాల్ డోర్జే తమాంగ్, లక్పా రింజీ షెర్పా తదిరులు పర్వతాన్ని అధిరోహించారు. మొత్తం 414 మంది అధిరోహకులు ఈ సీజన్‌లో ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు అనుమతి పొందారు.