Skip to main content

APPSC Group 1 Prelims Cutoff Marks 2024 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్-2024 క‌టాప్ మార్కులు ఇంతేనా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) 81 గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.
Group-1 Prelims-2024 Cutoff Marks   APPSC Group 1 Prelims Cutoff Marks 2024   Consensus Cutoff Marks for Group-1 Prelims-2024: 60-65

అయితే ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు కొశ్చ‌న్ పేప‌ర్‌ కొద్దిగా క‌ష్టంగా వ‌చ్చింది అంటున్నారు. అలాగే అభ్య‌ర్థుల్లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌-2024కి ఎంత క‌టాప్ ఉండొచ్చనే సందేహం ఉంది. మెయిన్స్‌కి ఎంత మందిని సెల‌క్ట్ చేస్తారు.. అనుకుంటున్నారు.

☛☛ APPSC Group-1 Prelims Paper-1 Answer Key 2024 : ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-1 కోశ్చన్‌ పేపర్‌ & కీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!

గ్రూప్‌-1 ప్రిలిమ్స్-2024 ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ క‌టాప్ మార్కుల‌పై పోటీప‌రీక్ష‌ల‌ ప్ర‌ముఖ సబ్జెక్ట్ నిపుణులు అభిప్రాయాల‌ను తీసుకుంది. అలాగే గ్రూప్‌-1 ప్రిలిమ్స్-2024 క‌టాప్ మార్కుల‌పై www.sakshieducation.com ప్ర‌త్యేకంగా ఆన్‌లైన్ ఓటింగ్ కూడా నిర్వ‌హించింది. సబ్జెక్ట్ నిపుణులు అభిప్రాయాల‌ను, ఆన్‌లైన్ ఓటింగ్ రెండింటి క్రోడీకరించిన తర్వాత గ్రూప్‌-1 ప్రిలిమ్స్-2024 క‌టాప్ మార్కుల 60-65 ఉండే అవ‌కాశం ఉంది.

☛☛ APPSC Group-1 Prelims Answer Key 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-2 కోశ్చన్‌ పేపర్‌ & కీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష :
ఈ పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గ్రూప్‌- ప్రిలిమ్స్ 2024 ప‌రీక్ష‌కు ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్విస్‌ కమిషన్‌ తెలిపింది. 

గ్రూప్‌–2 ప్రిలిమినరీ పరీక్ష 2024 :
గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి 1:100..?
Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్ప‌త్తి 1:100 ఉంటుంద‌ని ఏపీపీఎస్సీ బోర్డ్ మెంబ‌ర్ Parige Sudhir గారు ఎక్స్ వేదిక‌గా తెలిపారు. వ‌చ్చే వారంలోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని తెలిపారు. దీంతో గ్రూప్‌-2 ప్రిలిమ్స్ అభ్య‌ర్థుల‌కు ఉపసయనం ల‌భించ‌నున్న‌ది. APPSC Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్ప‌త్తి 1:100 ఇస్తే .. Cut Off  Marks భారీగా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. దీంతో చాలా మంది అభ్య‌ర్థులు మెయిన్స్ క్వాలిఫై అయ్యే అవ‌కాశం ఉంది. అలాగే గ్రూప్‌-2 అభ్య‌ర్థులు సంతోషంగా గ్రూప్‌-2 మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వ‌వ‌చ్చును. చాలా రోజుల నుంచి APPSC Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్ప‌త్తి 1:100 ఇస్తే మంచిద‌ని.. గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు కోరుతున్న విష‌యం తెల్సిందే. అయితే అభ్య‌ర్థులు విన్నపాలు మేర‌కు ఈ సెలక్షన్ రేషియో పై ఏపీపీఎస్సీ వ‌ర్గాలు సానుకులంగా ఉన్నారు.

Published date : 19 Mar 2024 05:23PM

Photo Stories