Skip to main content

APPSC Group-1 Prelims Question Paper with Key 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 2024 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ‌ప్ర‌దేశ్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) 81 పోస్టుల భర్తీకి గ్రూప్‌–1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను 2024 మార్చి 17వ తేదీన (ఆదివారం) నిర్వ‌హించారు.
Answer Key for APPSC Group-1 Prelims 2024    Answer Sheet for Andhra Pradesh Public Service Commission Group-1 Prelims 2024  APPSC Group1 Prelims Question Paper with Key 2024    APPSC Group-1 Prelims Exam Key 2024

ఓఎమ్మార్‌ ఆధారిత, ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష జ‌రిగింది.. APPSC Group-1 Prelims Paper-1 ప‌రీక్ష‌ 10:00 AM to 12:00 Noon వ‌రకు నిర్వ‌హించారు. అలాగే APPSC Group-1 Prelims Paper-2 ప‌రీక్ష‌ను 2:00 PM to 4:00 PM వ‌రకు నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం మీద ఈ 81 గ్రూప్‌-1 పోస్టుల‌కు 1,48,881 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కొక్క పోస్టుకు 1827 మంది పోటీప‌డుతున్నారు. 

☛ APPSC Group 2 Prelims 2024 Official Key 2024 PDF : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కీ విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం..
గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2024 రాత ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించ‌నున్నారు. ప‌రీక్ష ముగిసిన త‌ర్వాత‌ గ్రూప్‌–1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 & 2 రాత ప‌రీక్షకు సంబంధించిన 'కీ' సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో అందుబాటులో ఉంది. అలాగే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేప‌ర్‌-1 & 2 కొశ్చ‌న్‌పేప‌ర్ కూడా వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) విడుద‌ల చేసే 'కీ' మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

 APPSC Group 2 Prelims Exam Cut Off 2024 Update : ఈ సారి గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి 1:100..? దీనిపై ఏపీపీఎస్సీ వ‌ర్గాలు..

రెండు పేపర్లగా గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వ‌హించారు. ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్-1 ప్రిలిమనరీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో 301 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు  పేపర్ -1 జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వ‌హించారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ -2  జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షకి 18 జిల్లాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమారాలతో పర్యవేక్షించనున్నారు.

గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష పర్యవేక్షణకు 18 మంది ఐఏఎస్‌లను నియమించారు. జిల్లా కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలని అభ్యర్ధులకు ఎపీపీఎస్సీ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమనరీ నిర్వహణకు 301 మంది లైజనింగ్ అధికార్లు, 6612 మంది ఇన్విజలేటర్లు నియమించారు. ఏపీపీఎస్సీ నుంచి 39 మందికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2024 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే..

 

Published date : 18 Mar 2024 12:47PM

Photo Stories