APPSC Group 2 Prelims Exam Cut Off 2024 Update : ఈ సారి గ్రూప్-2 ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి 1:100..? దీనిపై ఏపీపీఎస్సీ వర్గాలు..

దీనిపైన ఏపీపీఎస్సీ వర్గాలు ఒక స్పష్టమైన క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. అయితే APPSC Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్పత్తి 1:100 ఇస్తే మంచిదని గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు కోరుతున్నారు. అయితే అభ్యర్థులు విన్నపాలు మేరకు ఈ Cut Off పై ఏపీపీఎస్సీ వర్గాలు సానుకులంగా ఉన్నట్టు తెలిసింది. ఒక వేళ APPSC Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్పత్తి 1:100 ఇస్తే.. Cut Off Marks భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.
గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడంటే..?
ఈ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా 4,04,037 మంది అంటే.. (87.17) శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు అత్యధికంగా హాజరవడం విశేషం.గ్రూప్–2 ప్రిలిమ్స్ ఫలితాలను 5 నుంచి 8 వారాల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
APPSC Group -2 మెయిన్ ఎగ్జామినేషన్ విధానం ఇలా..:
APPSC Group-2 స్క్రీనింగ్ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్షను రెండు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్–1లో సెక్షన్–1: సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు); సెక్షన్–2: భారత రాజ్యాంగం సమీక్షల నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు) అడుగుతారు. పేపర్–2లో సెక్షన్–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ; సెక్షన్–2 సైన్స్ అండ్ టెక్నాలజీల నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు) అడుగుతారు.
Tags
- appsc group 2 cutoff marks 2024
- appsc group 2 cut off marks prelims 2024 updates
- APPSC Group 2 Prelims Exam Cut Off Marks 2024 Details in Telugu
- APPSC Group 2 Prelims Exam Cut Off Marks 2024 News
- APPSC Group 2 Prelims Exam Cut Off 2024 Update News
- APPSC Group 2 Prelims Exam 2024 Results
- APPSC Group-2 Prelims Exam 2024 attendance
- APPSC Group-2 Prelims Exam 2024 attendance district wise
- appsc group 2 prelims qualifying marks 2024
- appsc group 2 prelims qualifying marks 2024 update
- APPSC Group 2 Prelims Results 2024 Date and Time
- APPSC Group 2 Prelims Results 2024: Download cut off for selection
- APPSC
- Group-2 Prelims Exam
- Selection Ratio
- sakshieducationlatest news