Entrance Exam: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు తేదీ విడుదల..
కంచరపాలెం: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 10న ఆదివారం పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉమ్మిడి జిల్లాల గురుకులాల సమన్వయకర్త ఎస్.రూపవతి తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి విశాఖ జిల్లా పరిధిలోని 3 గురుకులాలు, అనకాపల్లి జిల్లా పరిధిలో 8 గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
IB Team with Students: ఐబీ బృందంతో మోడల్ స్కూల్ విద్యార్థులు
ఈ రెండు జిల్లాల్లో 5వ తరగతికి 880 సీట్ల కోసం 3,808, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 880 సీట్ల కోసం 2,221 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 5వ తరగతి అభ్యర్థులకు, సాయంత్రం 2 నుంచి 4.30 గంటల వరకు ఇంటర్ అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 5వ తరగతి విద్యార్థులు https:// apbragcet.apcfss.in/fifth-hallticket, ఇంటర్ విద్యార్థులు https://apbragcet.apcfss.in/interhallticket వెబ్‌సైబ్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాలకు 0891–2799641లో సంప్రదించవచ్చు.
Geographical Indication Tag: కటక్ సిల్వర్ ఫిలిగ్రీకి భౌగోళిక సూచిక గుర్తింపు