Maha Kumbh Mela 2025: కుంభమేళాలో ఒకేరోజు 2 కోట్ల మంది పుణ్యస్నానాలు

ఈ సందర్భంలో ఈసారి పర్యవేక్షణ మరియు ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా చేయడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జనవరి 29వ తేదీన పుణ్యస్నానాల సమయంలో జరిగిన విషాద సంఘటనను దృష్టిలో పెట్టుకుని, ఈసారి భక్తుల భద్రతకు పూర్తి ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మేము ఉదయం 4 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రత్యేక సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించి, సుమారు 2,750 హైటెక్ కెమెరాలు, డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థల ద్వారా 24 గంటల పాటు నిఘా నిర్వహించారు.
మహా కుంభ్ ప్రాంతంలో ఈసారి "నో వెహికల్ జోన్" ప్రకటించడం ద్వారా రాకపోకలను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు 1,200 అదనపు బస్సులను అందుబాటులోకి తెచ్చారు.
Mahakumbh 2025: కుంభమేళాలో.. 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలు ఇవే..
ఈ కార్యాచరణను స్మూడ్‌గా నిర్వహించడంలో యూపీ పోలీసుల విధానాలు, అవగాహన, మరియు భద్రతా ఏర్పాట్లు కీలకంగా పనిచేశాయి. ఈ మహాకుంభ్ మేళా 26వ తేదీ వరకు కొనసాగుతుంది, చివరి అమృత్ స్నాన ఘట్టం మహాశివరాత్రి రోజున జరగనుంది.
పలువురు ప్రముఖుల రాక
మాఘి పూర్ణిమ సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, తల్లి కోకిలా బెన్, కుమారులు, కోడళ్లు, మనవడు, మనవరాలు తదితరులతో కలిసి త్రివేణీ సంగమంలో స్నానాలు చేశారు. అదేవిధంగా, దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఆయన భార్య పుణ్యస్నానాలు చేశారు. వీఐపీ ప్రొటోకాల్స్‌ను బుధవారం నిలిపివేయడంతో కుంబ్లే దంపతులు మిగతా భక్తుల మాదిరిగానే పడవలో త్రివేణీ సంగమానికి పడవలో చేరుకుని, పూజలు చేశారు.