Gas Subsidy: రూ.33,000 కోట్లకు పైనే.. గ్యాస్ సబ్సిడీ
Sakshi Education
దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలను కట్టెల పొయ్యి అవస్థల నుంచి కాపాడుతూ.. కాలుష్య రహిత వంట గ్యాస్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) ప్రారంభించింది.

మహిళలకు డిపాజిట్ లేకుండానే ఎల్పీజీ సిలిండర్ అందిస్తోంది. ఈ పథకం కింద 2025 జనవరి 1వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా 10.33 కోట్ల కనెక్షన్లు ఇచ్చారు. వీళ్లందరికీ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే కేంద్రం వేస్తోంది.
ఇలా ఇప్పటివరకూ రూ.33వేల కోట్లకుపైగా అందించింది. ఒక్క 2023-24 సంవత్సరం లోనే అత్యధికంగా రూ.10,217 కోట్లు ఇచ్చింది.
సంవత్సరం | సబ్సిడీ మొత్తం (రూ.కోట్లలో) |
---|---|
2016-17 | 2,999 |
2017-18 | 2,559 |
2018-19 | 5,670 |
2019-20 | 1,446 |
2020-21 | 8,238 |
2021-22 | 1,569 |
2022-23 | 6,110 |
2023-24 | 10,217 |
దీనికి ఆధారం.. కేంద్ర పెట్రోలియం శాఖ, పెట్రోలియం ప్రణాళిక విశ్లేషణ సెల్..
EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఆధార్ లింకు ఉంటేనే ఈపీఎఫ్ ప్రోత్సాహకాలు
Published date : 12 Feb 2025 09:50AM