Skip to main content

IB Team with Students: ఐబీ బృందంతో మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు

ఐబీ విద్యను వచ్చే విద్యా సంవత్సరంలో ‍ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో పాఠశాలకు సందర్శించింది బృందం. ఈ మెరకు అధికారులతో, విద్యార్థులతో చర్చించారు..
Preparing for IB International Rite in 2025-26   A view of honoring the IB team visiting Patipally Model School   IB Team Visits Patipally Model School

మునగపాక: మండలంలోని పాటిపల్లి మోడల్‌ స్కూల్‌ను మంగళవారం ఐబీ బృందం సందర్శించింది. 2025–26 సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొదటి తరగతి నుంచి ఐబీ ఇంటర్నేషనల్‌ రాయిట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జిల్లాలోని పాటిపల్లి మోడల్‌ స్కూల్‌ను ఎంపిక చేసుకొని సందర్శించారు. పాఠశాలలో బోధనా పద్ధతులు, అభ్యసన తదితర అంశాలపై ప్రిన్సిపాల్‌ పి.పి.ఎస్‌.శ్రీలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు.

IB Team Inspection: ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఐబీ బృందం

కెమిస్ట్రీ ల్యాబ్‌ను, అటల్‌ ల్యాబ్‌లో విద్యార్థులు తయారు చేసిన అగ్రికల్చర్‌ కటింగ్‌ మిషన్‌ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మరిన్ని ప్రాజెక్ట్‌లు చేసేలా విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి తరగతిని సందర్శించి బోధన తీరును, ఐఎఫ్‌పీ బోర్డుల వినియోగాన్ని పరిశీలించారు. డిప్యూటీ డీఈవో పి.అప్పారావు, ఇతర ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐబీ బృందాన్ని ఘనంగా సత్కరించారు.

YS Jagan Mohan Reddy: యువతరానికి దిక్సూచి ‘భవిత’

Published date : 06 Mar 2024 12:45PM

Photo Stories