CTET 2024 Exam Postponed: సీటెట్‌ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే

సెంట్రల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(CTET)డిసెంబర్‌-2024 పరీక్ష తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. ఈ మేరకు సీబీఎస్‌ఈ(CBSE) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సీటెట్‌ పరీక్ష డిసెంబర్‌ 01 న జరగాల్సి ఉండగా తాజాగా మార్పులు చేశారు. డిసెంబర్‌15వ తేదీన (ఆదివారం) నిర్వహించనున్నట్లు తెలిపారు.

NEET Telangana Medical Counselling: మెడికల్‌ కౌన్సెలింగ్‌కు లైన్‌ క్లియర్‌,సుప్రీంకోర్టు ఉత్తర్వులతో..

పరిపాలనా కారణాలతో పరీక్ష నిర్వహణ తేదీని రీషెడ్యూల్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు తేదీల్లో ఎలాంటి మార్పు చేయలేదని పేర్కొన్నారు. కాగా సీటెట్‌ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధనకు పేపర్‌-1కు హాజరు కావలసి ఉంటుంది. అదేవిధంగా ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచింగ్‌కు పేపర్‌-2లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

Internship Drive: జేఎన్‌టీయూ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ డ్రైవ్‌

రెండు స్థాయిల్లోనూ బోధించాలనుకునే వారు రెండు పేపర్లకు హాజరై ఉత్తీర్ణత సాధించాలి.సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప‌రీక్ష 20 భాషల్లో నిర్వహిస్తారు. సీటెట్‌ స్కోర్‌తో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags