Download Hallticket for AP EAPCET 2023 : ఏపీ ఈఏపీసెట్‌–2023 హాల్‌టికెట్ల కోసం కోసం క్లిక్‌ చేయండి.. మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..?

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌–2023కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. మే 8వ తేదీ (సోమవారం) నాటికి 3,38,407 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ap eamcet hall ticket download 2023

వీరిలో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,037 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,370 మంది ఉన్నారు. 

ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ ఇదే..
ఈ మొత్తం దరఖాస్తులు గతేడాది ఆలస్య రుసుముతో చివరి గడువు నాటికి వచ్చిన వాటికంటే అధికంగా ఉండటం విశేషం. ఏపీ ఈఏపీసెట్‌కు రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 12వ తేదీ వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

☛ EAMCET/AP EAPCET 2023: ఇలా చేస్తే.. టాప్‌ ర్యాంక్‌ ఖాయం
 

వెబ్‌సైట్‌లో  హాల్‌టికెట్లు :

మే 9వ తేదీ (మంగళవారం) నుంచి అభ్యర్థులకు  cets.apsche.ap gov.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు అందించనున్నారు. మన రాష్ట్రంలో 45, హైదరాబాద్‌లో రెండు కలిపి మొత్తం 47 ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో అనకాపల్లి, అనంతపురం, గుత్తి, తాడిపత్రి, మదనపల్లి, రాజంపేట, బాపట్ల, చీరాల, చిత్తూరు, పలమనేరు, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, అమలాపురం, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, కర్నూలు, ఎమ్మిగనూరు, నంద్యాల, మైలవరం, తిరువూరు, విజయవాడ, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, కావలి, నెల్లూరు, పుట్టపర్తి, శ్రీకాకుళం, టెక్కలి, గూడూరు, పుత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, ఆనందపురం, గాజువాక, బొబ్బిలి, రాజాం, విజయనగరం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, కడప, ప్రొద్దుటూరుల్లోను, హైదరాబాద్‌లో ఎల్బీనగర్, సికింద్రాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

AP EAMCET 2023 Hall ticket కోసం క్లిక్‌ చేయండి

రోజుకు రెండు సెషన్లలో.. ఆన్‌లైన్‌లో పరీక్ష :

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి మే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో జేఎన్‌టీయూ అనంతపురం అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.

చదవండి: ఎంసెట్‌లో సత్తా చాటేలా.. ప్రిపరేషన్‌ సాగించండిలా..

చదవండి: TS EAMCET and AP EAPCET Previous Papers

చదవండి: EAMCET Practice Questions

పరీక్షావిధానం ఇలా..:

ఒక్కో విభాగంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో 160 ప్రశ్నలుంటాయి. సరైన సమాధానం రాస్తే ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయిస్తారు. ఇలా ఇంజనీరింగ్‌ విభాగంలో గణితం 80, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవసాయ, ఫార్మా విభాగంలో బయాలజీ 80 (బోటనీ 40, జువాలజీ 40), ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీలో 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

చదవండి: Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే..

#Tags