AP EAPCET 2023 Counselling: విద్యార్థులు ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవాలి? ఏ కళాశాలలో చదివితే మంచిది?
అనంతపురం: ఏపీ ఈఏపీసెట్‌కు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. సెట్‌లో ర్యాంక్ దక్కించుకున్న విద్యార్థులు ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవాలి? ఏ కళాశాలలో చదివితే మంచిది? అనే మీమాంశంలో కొట్టుమిట్టాడుతున్నారు. కోర్ బ్రాంచ్ కోర్సులు మంచివా? కంప్యూటర్ సైన్సెస్ చదివితే లాభమా? అనే అంశంపై తల్లిదండ్రులు సైతం తర్జనభర్జన పడుతున్నారు. ఇదే అంశంపై నిపుణులు, ప్రొఫెసర్లను ఆరా తీస్తున్నారు. నేరుగా కళాశాలకు వెళ్లి మౌలిక సదుపాయాలను పరిశీలిస్తున్నారు. వివిధ అంశాలను బేరీజు వేసుకుంటూ నిర్ధారణకు వస్తున్నారు. అయితే సింహభాగం తల్లిదండ్రులు, విద్యార్థులు మౌలిక సదుపాయాలున్న కళాశాల మంచిదా? నచ్చిన కోర్సులో అడ్మిషన్ పొందడమా అనే అంశంపై సందిగ్ధతతో కొట్టుమిట్టాడుతున్నారు.
EAMCET 2023: రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీ
క్యాంపస్ కళాశాలకు అధిక పోటీ:
ఏపీ ఈఏపీసెట్‌లో టాప్ ర్యాంకర్లు వర్సిటీ క్యాంపస్ కళాశాలను తొలి ప్రాధాన్యతగా ఎంచుకుని ఆప్షన్లు ఇచ్చారు. రాయలసీమలోనే సాంకేతిక కల్పతరువుగా ఉన్న జేఎన్‌టీయూ(ఏ)ఇంజినీరింగ్ క్యాంపస్ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి ర్యాంకర్లు విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది.